నాయకితో బాల(కృష్ణుడి) చిలిపి చేష్టలు | Balakrisha Kissed trisha in Nayaki Audio Launch

Balakrisha kissed trisha in nayaki audio launch

Balakrisha Kissed trisha in Nayaki Audio Launch, Nayaki Trailers, Nayaki Songs, బాలకృష్ణ, త్రిష, నాయకి, Balakrishna in Nayaki audio launch, Nayaki posters, Balakrishna with trisha, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, Trisha latest stills, Trisha hot stills, Trisha photoshoot, Balakrishna latest stills

Balakrisha Kissed trisha in Nayaki Audio Launch: South indian star heroine trisha latest telugu, tamil film Nayaki audio launched on 19 april. Nandamuri balakrishna launches audio.

నాయకితో బాల(కృష్ణుడి) చిలిపి చేష్టలు

Posted: 04/20/2016 10:34 AM IST
Balakrisha kissed trisha in nayaki audio launch

టాలీవుడ్ అగ్ర హీరో నందమూరి బాలకృష్ణ చిలిపి చేష్టలు రోజురోజుకి మరీ ఎక్కువైపోతున్నాయని తెలుగు ప్రజలు భావిస్తున్నారు. మొన్న ‘విశాఖ ఉత్సవ్ 2016’ ముగింపు కార్యక్రమంలో ‘పొగత్రాగనివాడు మరుజన్మలో దున్నపోతై పుట్టును... అంటే ప్యూర్ బఫెల్లో’ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ‘సావిత్రి’ ఆడియో విడుదల కార్యక్రమంలో ‘అమ్మాయిల వెంటపడితే ఊరుకుంటారా ఫ్యాన్స్.. ఊరుకోరు కదా! వెళ్లి ముద్దు అయినా పెట్టాలి లేదా కడుపైనా చేసేయ్యాలి... కమిట్ అయిపోవాలి’ అని మాట్లాడి తెలుగు ఆడపడచులు ఆగ్రహానికి గురయ్యారు. నిన్న తమిళనాడు ఏకంగా షర్టు విప్పేసి, పబ్లిక్ గా సిగరేట్ తాగుతూ క్రికెట్ ఆటను తిలకించి సౌత్ ఇండస్ట్రీలోనే హాట్ టాపిక్ అయ్యారు.

ఇలా రోజు రోజుకి బాలయ్యపై ఫిర్యాదులు ఎక్కువవుతున్నాయి. తాజాగా మరోసారి బాలయ్య హాట్ టాపిక్ గా మారాడు. సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ త్రిష నటిస్తున్న తాజా తెలుగు, తమిళ చిత్రం ‘నాయకి’. గోవి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి రఘు కుంచె సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి బాలయ్య ముఖ్య అతిథిగా విచ్చేసారు.

ఈ వేడుక ప్రారంభంలో త్రిషను కలవగానే... త్రిష బుగ్గలపై ముద్దు పెట్టి వెల్ కమ్ చెప్పేసాడు బాలయ్య. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు చూసినవాళ్లంతా కూడా ‘బాలయ్యకు వయసు పెరిగినకొద్ది తనలోని బాలకృష్ణుడు మరింతగా రెచ్చిపోతున్నాడు’, ‘హీరోయిన్ కనిపిస్తే.. మరీ అలా ముద్దులు పెట్టేయడమేనా...’ అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో బాలయ్య చేసిన ఈ పనిని సమర్ధిస్తూ.. గతంలో వీరిద్దరూ కలిసి ‘లయన్’ సినిమాలో నటించారు కాబట్టి.. ఆ చనువుతో అలా ముద్దులు పెట్టి వుంటాడని సమర్థించుకుంటున్నారు.

ఏదేమైనా బాలయ్య-త్రిషల కాంబినేషన్లో వచ్చిన ‘లయన్’ సినిమా అట్టర్ ఫ్లాప్ అయినప్పటికీ... ‘నాయకి’ ఆడియో విడుదల కార్యక్రమంలో వీరి ముద్దుల సరసం ఫోటోలు మాత్రం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారి భారీ విజయం సాధించాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి ‘నాయకి’ ఆడియో వేడుకలో ఈ కిస్ మూమెంట్ హైలెట్ గా నిలిచిందని సినీజనాలు కోడైకూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Balakrishna  Trisha  Nayaki  బాలకృష్ణ  త్రిష  నాయకి  

Other Articles