రావణాసురుడిగా మారిపోయిన కండల వీరుడు | Sudheer Babu Raghav in Baaghi

Sudheer babu raghav in baaghi

Sudheer Babu as Raghav in Baaghi, Baaghi Trailer, Baaghi stills, Baaghi movie trailer, Tiger Shroff Baaghi trailer, Baaghi movie updates, Baaghi release date, Baaghi

Sudheer Babu Raghav in Baaghi: UTV Motion Pictures and Nadiadwala Grandson Entertainment Present Baaghi, starring Tiger Shroff and Shraddha Kapoor and directed by Sabbir Khan. The film releases on April 29,

రావణాసురుడిగా మారిపోయిన కండల వీరుడు

Posted: 04/19/2016 06:23 PM IST
Sudheer babu raghav in baaghi

తెలుగులో ప్రభాస్, త్రిష, గోపిచంద్ ప్రధాన పాత్రలలో నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘వర్షం’ చిత్రాన్ని బాలీవుడ్ లో ‘భాగీ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. హిందీలో టైగర్ ష్రాఫ్, శ్రధ్దాకపూర్ జంటగా నటిస్తున్నారు. తెలుగులో గోపిచంద్ నటించిన పాత్రను హిందీలో నటుడు సుధీర్ బాబు నటిస్తున్నాడు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్రైలర్ లో సుధీర్ బాడీ, యాక్టింగ్ లుక్స్ వల్ల బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇపుడు ఎక్కడ చూసిన సుధీర్ లుక్స్ గురించే చర్చలు జరుగుతున్నాయి. బాలీవుడ్ హీరో రేంజులో అదిరిపోయే బాడీ ఫిట్ నెస్ తో, స్టైలిష్ యాక్షన్ విలన్ గా ఇందులో అదరగొట్టాడు.

ఇక తాజాగా ‘భాగీ’ సినిమాలో సుధీర్ బాబు పాత్రకు సంబంధించి ఓ వీడియోను విడుదల చేసారు. ఈ వీడియోలో సుధీర్ బాబు తన దేహదారుఢ్యంతో ఆకట్టుకుంటున్నాడు. అలాగే యాక్టింగ్, యాక్షన్ సీన్లలో హీరోకు సరైన విలన్ గా కనబడుతున్నాడు. ఆ వీడియోను మీకోసం అందిస్తున్నాం.. మీరు ఓ లుక్కేయండి.

యూటివి మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై సాజిద్ నడియడ్ వాలా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇందులో శ్రద్ధాకపూర్ గ్లామర్ అందాల ఆరబోత భారీగానే చేసింది. ఇక టైగర్ చేసిన యాక్షన్ సీన్లు హైలెట్ కానున్నాయి. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sudheer Babu  Baaghi  Shraddha Kapoor  

Other Articles