దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘లోఫర్’ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యి, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. అయితే గతకొద్ది రోజులుగా పూరీ-డిస్ట్రిబ్యూటర్లకు మధ్య వాగ్వివాదం జరుగుతోంది. ఈ విషయంలో ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ లపై ఈనెల 14న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పూరీ ఫిర్యాదు చేసారు. వీరిపై ఆరు సెక్షన్ల కింద కేసులు పెట్టారు పూరీ. ఈ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడిచేస్తున్నట్లుగా ఫిర్యాదు చేసారు.
ఈ ఫిర్యాదులపై డిస్ట్రిబ్యూటర్లు స్పందిస్తూ... పూరి జగన్నాథ్ పై తాము ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని, ‘లోఫర్’ సినిమా ఫ్లాప్ కావడంతో తమ డబ్బులు తిరిగివ్వాలని నిర్మాత సి.కల్యాణ్ ను అడిగామని తెలిపారు. కానీ పూరి జగన్నాథ్ ఇంటికి వెళ్లలేదు, ఆయనతో మాట్లాడలేదని డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు. తమపై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారని, ఇంత ఏకపక్షంగా కేసులు ఎలా పెడతారని వారు ప్రశ్నించారు. నిజానిజాలు దర్యాప్తులో వెల్లడవుతాయన్నారు. సిసి కెమెరాలు పరిశీలిస్తే నిజానిజాలు బయటపడతాయి. దాడిచేసినట్లుగా ఆధారాలు చూపిస్తే తాము ఏ శిక్షకైనా సిద్ధమేనని వారు ప్రకటించారు. తప్పు తమది అని తేలితే తమని లోపల(పోలీస్ స్టేషన్లో) వేయండి. లేదా అతనిది తప్పని తేలితే.. అతడిని లోపల వేయండి అని స్పష్టం చేసారు.
డిస్ట్రిబ్యూటర్ల వాదనపై చివరకు పూరీ జగన్నాథ్ స్పందించారు. ఈ విషయంపై పూరీ స్పందిస్తూ... ‘లోఫర్’ సినిమా విడుదలకు ముందే డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్ తనని కలిశారని, వాళ్ల బ్యానర్లో తాను ఐదు సినిమాలు చేసేలా ఒప్పందం చేసుకుందామని అన్నారని.. కానీ మూడో డిస్ట్రిబ్యూటర్ మత్యాల రాందాస్ మాత్రం ప్రత్యేకంగా తనకో సినిమా చేసిపెట్టాలని అడిగారని పూరీ తెలిపారు. ఐతే ఈ ముగ్గురి ఉద్దేశాలేంటన్నది తర్వాత కానీ తనకు తెలియలేదని, ఒప్పందాల పేరుతో వాళ్లకున్న అప్పుల్ని తనపై రుద్దే ప్రయత్నం చేశారని. వాళ్ల నష్టాలకు నన్ను బాధ్యుణ్ని చేయాలని చూశారని పూరీ చెప్పుకొచ్చారు.
కానీ ‘లోఫర్’ సినిమా విడుదల సమయంలో ఆ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు మాట్లాడుతూ పూరి డిస్ట్రిబ్యూటర్ల డైరెక్టర్ అని.. తనని నమ్మే లోఫర్ నైజాం హక్కులను రూ. 7.5 కోట్లకు కొన్నామని చెప్పారు. కానీ వాస్తవం ఏంటంటే ఆ సినిమా నైజాం హక్కులు రూ. 3.4 కోట్లకే అమ్మినట్లు నిర్మాత సి.కల్యాణ్ చెప్పారు. దీన్ని బట్టే ఆ ముగ్గురూ ఎంత డ్రామా ఆడారో అర్థం చేసుకోవచ్చునని పూరీ తెలిపారు. అలాగే పూరీ తాను కూడా ఓ నిర్మాతననే విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.
తాను కూడా నిర్మాతనేనని.. తన నిర్మాణంలో వచ్చిన చాలా హిట్ సినిమాలకు బయ్యర్లు ఇవ్వాల్సినంత డబ్బులు ఇవ్వలేదని.. కానీ నష్టాలు వచ్చినపుడు మాత్రం తాను క్లియర్ చేశానని పూరి చెప్పాడు. అయితే ఈ ‘లోఫర్’ సినిమాకు తాను కేవలం దర్శకుడిని మాత్రమేనని.. నష్టాలకు తనను బాధ్యుడ్ని చేయడం ఎంతమాత్రం సరికాదని అన్నాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం తన రెమ్యూనరేషన్ కూడా తగ్గించుకున్నట్లు పూరి చెప్పుకొచ్చాడు.
ఇలా పూరీ జగన్నాథ్ వున్నట్లుండి తనకేం సంబంధం లేదన్నట్లుగా మాట్లాడటంపై అందరూ షాక్ కు గురవుతున్నారు. పైగా సినిమా విడుదలకు ముందే డిస్ట్రిబ్యూటర్లు మోసం చేసారని తెలిసిన పూరీ.. అప్పుడే నిజానిజాలు బయటపెట్టకుండా ఇపుడు ఇలా మాట్లాడటమేంటని అందరూ భావిస్తున్నారు. కానీ పూరీ మాటలకు డిస్ట్రిబ్యూటర్లు మాత్రం వెనక్కి తగ్గే పరిస్థితి లేనట్లుగా టాలీవుడ్ వర్గాల సమాచారం. మరి పూరీ మాటలకు డిస్ట్రిబ్యూటర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
(And get your daily news straight to your inbox)
May 17 | విశ్వనటుడు కమల్ హాసన్ విశ్వరూపం చిత్రం తరువాత ఇప్పటి వరకు ఏ సినిమా రాలేదు. ఆయన రాజకీయ అరంగ్రేటం చేయడంతో సినిమాలకు తాత్కాలికంగా పక్కన బెట్టారు. నుంచి సినిమా వచ్చి దాదాపు నాలుగేళ్ళు దాటింది.... Read more
May 16 | యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి దాదాపు రెండేళ్ళు దాటింది. ప్రస్తుతం ఈయన నటించిన లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 25న ప్రేక్షకుల... Read more
May 16 | టాలీవుడ్ చిత్రపరిశ్రమలో ఎప్పుడో రెండు దశాబ్దాల క్రితం వచ్చిన కామెడీ సీక్వెల్ ఇన్నాళ్లకు మళ్లీ అనీల్ రావిపూడి పుణ్యమా అని రూపోందుతోంది. అప్పట్లో శివ నాగేశ్వర రావు తీసిన మనీ.. మనీ మనీ.. చిత్రాలు... Read more
May 09 | టాలీవుడ్ డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి. తన నటనతో... డాన్సింగ్తో సినీ ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. 2017లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అమె.. భానుమతి పాత్రలో,... Read more
May 09 | టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ నటించిన అశోకవనంలో అర్జున కళ్యాణం చిత్రంలో క్లాస్‌గా కనిపించాడు. ఇన్నాళ్లు యూత్ ను మాత్రమే ఆకర్షించిన ఆయన తొలిసారి మాస్ ఆడియన్స్ కు చేరువయ్యేలా వైవిద్యమైన చిత్రాన్ని... Read more