షూటింగ్ లో కుప్పకూలిపోయిన ‘సుల్తాన్’ నటుడు | Randeep Hooda fall down in Sultan sets

Randeep hooda fall down in sultan sets

Randeep Hooda collapses on Sultan sets, Randeep Hooda hospitalized, Sultan movie, సల్మాన్ ఖాన్, Salman khan, Anushka Sharma, stills, collections, hot stills, gallery

Randeep Hooda fall down in Sultan sets: Bollywood Hero Salman khan upcoming film Sultan. Randeep Hooda playing an important role in this film.

షూటింగ్ లో కుప్పకూలిపోయిన ‘సుల్తాన్’ నటుడు

Posted: 04/19/2016 01:22 PM IST
Randeep hooda fall down in sultan sets

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘సుల్తాన్’. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ‘సుల్తాన్’ షూటింగ్ సమయంలో నటుడు రణదీప్ హుడా అనుకోకుండా పడిపోవడం జరిగింది. దీంతో వెంటనే హాస్పిటల్లో చేర్చిన అతనికి ప్రస్తుతం ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అసలు ఏం జరిగిందంటే... బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్న నటుడు రణదీప్ హుడా నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘సుల్తాన్’ ఒకటి. ఇందులో ఓ కీలకమైన పాత్రలో రణదీప్ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సమయంలో రణదీప్ సడెన్ గా కుప్పకూలిపోయాడు. తీవ్రమైన అపెండిసిటిస్ ఎటాక్ రావడంతో వెంటనే అతనిని హాస్పిటల్ కు తరలించారు.

అతనికి వెంటనే ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఢిల్లీలోని ఫోర్బిస్ హాస్పిటల్లో సోమవారం అతనికి ఆపరేషన్ నిర్వహించినట్లుగా తెలిసింది. ప్రస్తుతం రణదీప్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే మళ్లీ షూటింగ్ లో పాల్గొంటారని ‘సుల్తాన్’

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Randeep Hooda  Salman Khan  Anushka Sharma  

Other Articles