డ్రమ్స్ వాయించి దుమ్మురేపిన సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు | Vikram and Venkatesh Playing Drums

Vikram and venkatesh playing drums

Vikram and Venkatesh Playing Drums, Natchathira Cricket Match Playing Drums, సూర్య, విశాల్, కార్తీ, శివకార్తికేయన్, Suriya Chennai Singam Won cricket Match, విక్రమ్, వెంకటేష్, మమ్ముట్టి, Surya Playing Drums, Vikram Playing Drums, Chennai Singam Surya, Surya Chennai Singam team win, Natchathira Cricket Match stills, Natchathira Cricket Match updates, Natchathira Cricket Match updates

Vikram and Venkatesh Playing Drums: Tamil Nadu Cine actors Natchathira Cricket Match completed on 17 april. Suriya's Chennai Singams Won The Natchathira Cricket Match

డ్రమ్స్ వాయించి దుమ్మురేపిన సౌత్ ఇండియన్ స్టార్ హీరోలు

Posted: 04/18/2016 11:11 AM IST
Vikram and venkatesh playing drums

చెన్నైలోని చెపాక్ స్టేడియం నిన్న (ఏప్రిల్ 17) సౌత్ ఇండియన్ నటీనటులతో మారుమ్రోగింది. తమిళ నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసం నిధుల సేకరణ నిమిత్తం క్రికెట్ మ్యాచ్ ను ఏర్పాటు చేసారు. ఇందులో తమిళ సినీ ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరోలు, నటులు పాల్గొన్నారు. 8 జట్లుగా ఏర్పడి, ఒక్కో జట్టు ఆరు ఓవర్లు ఆడారు. ఈ 8 జట్ల వివరాలు ఈ క్రింది విధంగా వున్నాయి.

జట్టు పేరు - కెప్టెన్
1. రామ్‌రాజ్ చెన్నై సింగమ్స్ - సూర్య
2. ఎస్థల్ మదురై కాళైస్ - విశాల్
3. శక్తి మసాలా కోవై కింగ్స్‌ - కార్తీ
4. ఎమ్జీఆర్ యూనివర్సిటీ నెల్లై డ్రాగర్స్ - జయంరవి
5. రామ్‌నాట్ రైనోస్ - విజయ్‌ సేతుపతి
6. తంజై వారియర్స్ - జీవా
7. సేలం చీటర్స్ - ఆర్య
8. కల్యాణ్ జ్యువెలర్ తిరుచ్చి టైగర్స్ - శివకార్తికేయన్

విజేతగా నిలిచిన సూర్య చెన్నై సింగం

ఇందులో చివరి మ్యాచ్ లో సూర్య చెన్నై సింగమ్స్ టీం విజయం సాధించింది. ఈ క్రికెట్ ఆట సమయంలో తారలంతా కూడా చాలా హుషారుగా ఆటగాళ్లను ఎంకరేజ్ చేసారు. ఈ వేడుకలో ఉలగనయగన్ కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ లు విచ్చేసారు. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, మలయాళ ఇండస్ట్రీ నుంచి మమ్ముట్టీ, కన్నడ నుంచి స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, సుదీప్ పాల్గొన్నారు.

తమిళ స్టార్ హీరో విక్రమ్ తన పుట్టినరోజును ఇదే వేడుకలో అందరి సమక్షంలో జరుపుకున్నారు. ఈ వేడుకలో అన్ని ఇండస్ట్రీలకు చెందిన తారలు వాయించిన డ్రమ్స్ హైలెట్ గా నిలిచింది. ప్రముఖ సంగీత విద్వాంసుడు శివమణి ఆధ్వర్యంలో తారలంతా డ్రమ్స్ వాయించారు. విక్రమ్, విశాల్, కార్తీ, శివకార్తికేయన్, విజయ్ సేతుపతిలతో పాటు విక్టరీ వెంకటేష్, మమ్ముట్టీ, సుదీప్ లు ఈ డ్రమ్స్ వాయించి దుమ్ముధులిపేసారు. ఆ వీడియోలను మీకోసం అందిస్తున్నాం.. మీరు ఓ లుక్కేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikram  Venkatesh  Surya  

Other Articles