పూరీ జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్ల ‘లోఫర్’ లొల్లి | Distributors Clarifies on Puri Jagannadh attack

Distributors clarifies on puri jagannadh attack

Loafer Distributors Clarifies on Puri Jagannadh attack, పూరీ జగన్నాథ్, లోఫర్, సి కళ్యాణ్, Distributors angry on Puri jagannadh, Loafer Distributors fired, అభిషేక్, సుధాకర్, వరుణ్ తేజ, Loafer Distributors clarifies, Puri Jagannadh issue, Loafer latest issues

Distributors Clarifies on Puri Jagannadh attack: Puri Jagannadh case filed on Loafer film Distributors. Now Loafer Film Distributors Clarifies on Director Puri Jagannadh attack and cases.

పూరీ జగన్నాథ్ పై డిస్ట్రిబ్యూటర్ల ‘లోఫర్’ లొల్లి

Posted: 04/18/2016 01:17 PM IST
Distributors clarifies on puri jagannadh attack

తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఎనర్జిటిక్ డైరెక్టర్ గా పేరు దక్కించుకున్న దర్శకుడు పూరీ జగన్నాథ్ పై ‘లోఫర్’ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ హీరోగా నిర్మాత సి.కళ్యాణ్ నిర్మించిన ‘లోఫర్’ చిత్రం విడుదలై అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఈ సినిమాను తీసుకున్న డిస్ట్రిబ్యూటర్లు నష్టానికి గురయ్యారు.

అయితే దర్శకుడు పూరీ జగన్నాథ్ పై ‘లోఫర్’ చిత్ర డిస్ట్రిబ్యూటర్లు దాడి చేసారంటూ గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ పై ఈనెల 14న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసారు. ఈ ముగ్గురు డిస్ట్రిబ్యూటర్లు తనపై దాడిచేస్తున్నట్లుగా ఫిర్యాదు చేసారు. అయితే ఈ వార్తలపై తాజాగా తెలుగు సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్రతినిధులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి, ఆ వార్తలకు ఓ క్లారిటీ ఇచ్చారు. దర్శకుడు పూరీ జగన్నాథ్ పై తాము దాడి చేసామని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజాలు లేవని డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేసారు.

ఈ సమావేశంలో డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ లతో పాటు సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ... పూరి జగన్నాథ్ పై తాము ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని, ‘లోఫర్’ సినిమా ఫ్లాప్ కావడంతో తమ డబ్బులు తిరిగివ్వాలని నిర్మాత సి.కల్యాణ్ ను అడిగామని తెలిపారు. కానీ పూరి జగన్నాథ్ ఇంటికి వెళ్లలేదు, ఆయనతో మాట్లాడలేదని డిస్ట్రిబ్యూటర్లు స్పష్టం చేశారు.


Video Source: TV9Telugu Live

పూరి జగన్నాథ్ పై దాడి చేశారని చెబుతున్న డిస్ట్రిబ్యూటర్లు అభిషేక్, సుధీర్, ముత్యాల రాందాస్ అసలు ఆ రోజున హైదరాబాద్ లోనే లేరని చెప్పుకొచ్చారు. తమపై ఆరు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారని, ఇంత ఏకపక్షంగా కేసులు ఎలా పెడతారని వారు ప్రశ్నించారు. నిజానిజాలు దర్యాప్తులో వెల్లడవుతాయన్నారు.

సిసి కెమెరాలు పరిశీలిస్తే నిజానిజాలు బయటపడతాయి. దాడిచేసినట్లుగా ఆధారాలు చూపిస్తే తాము ఏ శిక్షకైనా సిద్ధమేనని వారు ప్రకటించారు. తప్పు తమది అని తేలితే తమని లోపల(పోలీస్ స్టేషన్లో) వేయండి. లేదా అతనిది తప్పని తేలితే.. అతడిని లోపల వేయండి అని స్పష్టం చేసారు. గతంలో 'అఖిల్' విడుదలైన రెండో రోజే దర్శకుడు వివి వినాయక్ తమకు ఫోన్ చేసి 'మీ వెనుక నేనున్నాను' అంటూ భరోసా ఇచ్చారని వెల్లడించారు.

సినిమా విజయవంతమయితే లాభాల్లో 20 శాతమే మాత్రమే తమకు ఇస్తారని చెప్పారు. సినిమా ఫ్లాప్ అయినప్పుడు కనీసం 20 శాతం డబ్బులు వెనక్కు ఇవ్వాలని వాళ్లను వేడుకుంటున్నామన్నారు. తాము కూడా సినిమా పరిశ్రమలో భాగమేనని, తమను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Loafer  Puri Jagannadh  Distributors  

Other Articles