విడుదలకు టైం ఫిక్స్ చేసిన సూర్య ‘24’ | Surya 24 movie release on 6 May

Surya 24 movie release on 6 may

24 movie release date, 24 Official Trailer, 24 movie songs, సూర్య, 24 సినిమా, సమంత, నితిన్, నిత్యామీనన్, 24 movie posters, 24 movie stills, Surya 24 teaser, Surya movie stills, Surya, samantha, nithya menon

Surya 24 movie release on 6 May: Tamil Hero Surya upcoming film 24. Vikram kumar direction, Samantha, Nithya menon heroines, AR Rahaman music.

విడుదలకు టైం ఫిక్స్ చేసిన సూర్య ‘24’

Posted: 04/18/2016 10:03 AM IST
Surya 24 movie release on 6 may

వరుస హిట్ చిత్రాలతో దూసుకెళ్తున్న సూర్య హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘24’. ‘ఇష్క్’, ‘మనం’ చిత్రాల దర్శకుడు విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని స్టూడియో గ్రీన్ అధినేత కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో గ్లోబర్ సినిమాస్, 2డి ఎంటర్ టైన్ మెంట్స్, శ్రేష్ట్ మూవీస్ కలయికలో రూపొందుతోంది. సూర్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

సూర్య ‘24‘పై నమ్మకంతో వున్న అజయ్

ఇటీవలే విడుదలైన పాటలు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రెస్టిజియస్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. పూర్తిస్థాయి థ్రిల్లింగ్, లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే 6వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం భాషలలో విడుదల చేయనున్నారు.

ఇందులో సూర్య సరసన సమంత, నిత్యామీనన్ లు హీరోయిన్లుగా నటించారు. సూర్య పలు విభిన్న పాత్రలలో కనిపించి, కనువిందు చేయనున్నాడు. టైం పీరియడ్ తో కూడిన విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో తెలుగు నటుడు అజయ్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ‘24’ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

సాంకేతిక నిపుణులు... సంగీతం : ఎ.ఆర్.రెహమాన్; సినిమాటోగ్రఫి – కె.తిరునాపుక్కరసు; ఎడిటింగ్ – ప్రవీణ్ పూడి; ప్రొడక్షన్ డిజైన్ – అమిత్ రే మరియు సుభ్రదా చక్రబోర్తి; పాటలు – చంద్రబోస్ మరియు శశాంక్ వెన్నెలకంటి; సౌండ్ డిజైన్ – లక్ష్మీ నారాయణన్; సౌండ్ ఎఫెక్ట్స్ – ఇక్బాల్; యాక్షన్ – అన్బరివ్; కొరియోగ్రఫీ – రాజు సుందరం, బృంద, దినేష్, శ్రీధర్; విఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ – జులియన్ ట్రౌసెల్లియర్; మేకప్ – క్లోవర్ వూటాన్ మరియు ప్రీతి షీల్.జి.సింగ్; కాస్ట్యూమ్ డిజైన్- దర్శన్ జలన్, ఇషా-దివ్య మరియు నిధి-అనిషా; స్టిల్స్ – ఆర్.వెంకట్రామ్; పబ్లిసిటీ డిజైన్ – రైసింగ్ ఆపిల్, రెడ్ డాట్; పి.ఆర్.ఓ – ఎస్ కె ఎన్ మరియు ఏలూరు శ్రీను; నిర్మాత – సూర్య; రచన – దర్శకత్వం – విక్రం.కె.కుమార్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  24  Samantha  Nithya menon  

Other Articles