Akkineni | Akhil | Censor Report | Release Date

Akhil movie censor report

Akhil Movie Censor Process Completed, Akhil Movie Tamil Theatrical Trailer, Akhil Movie Release on 11 November, Akhil Akkineni Movie Release Date, Akhil Akkineni Movie Latest Updates, Akhil Akkineni Movie news, Akhil Akkineni Movie details, Akhil Akkineni Movie stills, Akhil Akkineni Movie posters, Akhil Akkineni Movie videos, Akhil Akkineni Movie making stills, Akhil Akkineni Movie making videos

Akhil Movie Censor Report: Akhil Akkineni latest film Akhil. VV Vinayak Direction. Censor process completed. Sayesha saigal heroine. hero nithin producer. Anoop and Thaman Music directors. This film will be release on 11 November.

అఖిల్ సినిమాకు సెన్సార్ U/A సర్టిఫికెట్

Posted: 11/06/2015 10:57 AM IST
Akhil movie censor report

అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తరుణం మరికొద్ది రోజులు మాత్రమే వుంది. అక్కినేని నాగార్జున చిన్న తనయుడు అఖిల్ హీరోగా ఎప్పుడెప్పుడూ వెండితెర మీద కనిపిస్తాడా అని అక్కినేని అభిమానులంతా ఎంతోకాలం నుంచి ఆశగా ఎదురుచూస్తున్నారు. ‘అఖిల్’ సినిమా దీపావళి కానుకగా విడుదల చేసి ఒకేసారి డబుల్ బోనాంజాను అందించడానికి అక్కినేని ఫ్యామిలీ సిద్ధమయ్యారు.

అఖిల్, సయేశా సైగల్ జంటగా నటించిన ‘అఖిల్’ చిత్రం ఈనెల 11వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా దీపావళి కానుకగా విడుదల కాబోతుంది. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని, సెన్సార్ బోర్డ్ నుంచి U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. యూత్ ఫుల్ లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో విడుదల చేయనున్నారు.

థమన్, అనూప్ సంయుక్తంగా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే ట్రైలర్లు, వీడియోలకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ‘పవర్ ఆఫ్ జువా’ ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై హీరో నితిన్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.

తమిళంలో సికె ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత సి.కళ్యాణ్ విడుదల చేస్తున్నారు. తాజాగా విడుదలైన తమిళ ట్రైలర్ చూస్తుంటే ‘అఖిల్’ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేస్తున్నాయి. అఖిల్ లుక్స్ పరంగా చాలా చక్కగా కనిపిస్తున్నాడు. అంతే కాకుండా స్టోరీలో ఏదో మంచి మ్యాటర్ వున్నట్లుగానే అనిపిస్తోంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో మరికొద్ది రోజుల్లోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Akkineni  Akhil  Censor Report  Release Date  Sayesha saigal  movie news  

Other Articles