Mahira Khan | Tweets | Apology

Pakistani actress mahira khan tweets apology for halloween photo

Mahira Khan Tweets Apology For Halloween Photo, Mahira Khan Tweets Apology, Mahira Khan Apology For Halloween Photo, Mahira Khan Apology, Mahira Khan latest news, Mahira Khan stills, Mahira Khan hot news, Mahira Khan

Pakistani actress Mahira Khan Tweets Apology For Halloween Photo: Pakistani actress Mahira Khan was the target of much ire ... She has since apologized for hurting anyone's sentiments.

క్షమాపణలు కోరిన పాకిస్థానీ హీరోయిన్

Posted: 11/06/2015 01:59 PM IST
Pakistani actress mahira khan tweets apology for halloween photo

సెలబ్రెటీలు అంటే పార్టీలు, ఫ్యాషన్, ఎంజాయ్ మెంట్స్ ఇవన్నీ కామన్. కానీ ఇలాంటి ఎంజాయ్ మెంట్స్ వల్లనే ఒక్కోసారి చిక్కులు ఏర్పడుతుంటాయి. తాజాగా అలాంటి చిక్కులే పాకిస్థానీ నటి మహీరాఖాన్ కు ఏర్పడింది. ఈ అమ్మడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల హాలోవిన్ పార్టీ సంధర్భంగా శివసేన అధినేత బాల్ ఠాక్రే గెటప్ లో పాకిస్థానీ దర్శకుడు అసీజ్ రజాతో పాటు క్యాట్ వుమన్ డ్రెస్ లో మహీరా ఫోటో దిగింది. ఇందులో దర్శకుడు రజా ‘మహీరాకో బాహర్ నికాలో’ అన్న ఫ్ల కార్డును పట్టుకొని వున్నాడు. ఈ ఫోటోను మహీరా తన సోషల్ మీడియా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.

ఈ ఫోటోపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చివరకు మహీరా ఖాన్ క్షమాపణలు చెప్పుకొచ్చింది. ఎవరిని ఇబ్బంది పెట్టేందుకో, మనోభావాలు దెబ్బతీయడం తన ఉద్దేశ్యం కాదనీ, ఒకవేళ ఈ ఫోటోవల్ల ఎవరైనా నొచ్చుకొని వుంటే క్షమాపణలు కోరుతున్నానని తెలిపింది. మొత్తానికి ఈ అమ్మడు సరదా కోసం తీసిన ఈ ఫోటో ఇంత పెద్ద హాట్ టాపిక్ గా మారుతుందని ఊహించలేకపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahira Khan  Tweets  Apology  Halloween Photo  

Other Articles