Samantha | Piracy | Films | 10 Enrathukulla

Samantha encouraged piracy films

Samantha encouraging Piracy Films, Samantha encouraging Piracy, Samantha Piracy Films, Samantha latest news, Samantha hot news, Samantha fans angry, Samantha hot news, Samantha piracy news, Samantha piracy issue

Samantha encouraged Piracy Films: Tollywood heroine Samantha latest tamil film 10 Enrathukulla. this film recently released. samantha encouraged the Piracy of her Film.

తాగుతూ అడ్డంగా దొరికిపోయిన సమంత

Posted: 10/31/2015 10:37 AM IST
Samantha encouraged piracy films

మొన్నటివరకు హీరోల పోస్టర్లు, వాళ్ల సినిమాలపై కామెంట్లు చేసి అభిమానుల ఆగ్రహానికి గురైన సమంతకు ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ నుంచి ఇబ్బందులు వచ్చిపడుతున్నాయి. ఎంతో కష్టపడి సినిమా తీస్తే బయటివాళ్లు పైరసీ చేసేస్తున్నారని సినీ ఇండస్ట్రీ వాళ్లు తెగ కామెంట్లు చేస్తుంటారు. కానీ సినిమా తీసే వారే పైరసీ చేస్తే ఎలా వుంటుందో చెప్పండి? ప్రస్తుతం సమంత పరిస్థితి కూడా అలాగే వుంది.

విక్రమ్, సమంత జంటగా నటించిన తమిళ చిత్రం ‘10 ఎండ్రాదుకుల్ల’. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటోను సమంత తన సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. సమంత బీడీ(ధూమపానం)కాలుస్తున్న ఫోటో అది. కానీ ఆ ఫోటో పైరసీ వీడియో నుంచి తీసిన ఫోటో కావడంతో ఈ అమ్మడిపై తీవ్ర విమర్శలు వెల్లివెత్తుతున్నాయి.

సినిమాలో నటించిన సమంతయే ఇలా పైరసీ వీడియోలను ప్రోత్సహించడంపై అటు చిత్ర దర్శకనిర్మాతలు, ఇటు సినీ ఇండస్ట్రీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమంత ఇలా చేయడం సరైనది కాదంటూ వారు విమర్శలు గుప్పిస్తున్నారు. అంతేకాకుండా సోషల్ మీడియాలలో కూడా సమంతపై సినీ జనాలు తీవ్రంగా కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై సమంత ఎలా స్పందించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Samantha  Piracy  Films  10 Enrathukulla  tweets  

Other Articles