Varun Tej | Scared | Pawan kalyan

Varun tej afraid of pawan kalyan

Varun Tej scared about pawan kalyan, Varun scared, Varun Tej comments on pawan kalyan, Varun Tej latest interviews, Varun Tej latest news, Varun Tej movies, Varun Tej movie updates, Varun Tej stills, Varun Tej, Pawan kalyan

Varun Tej afraid of pawan kalyan: Mega hero Varun Tej hot comments on power star pawan kalyan. He is scared about pawan kalyan.

బాబాయ్ అంటే భయం... నావల్ల కాదంటున్న వరుణ్

Posted: 10/31/2015 10:15 AM IST
Varun tej afraid of pawan kalyan

మెగా హీరో వరుణ్ తేజ నటించిన తాజా చిత్రం ‘కంచె’. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాను మరింతగా ప్రమోట్ చేయడంలో చిత్ర యూనిట్ బిజీగా వున్నారు. ఈ సంధర్భంగా వరుణ్ పలు మీడియా ఇంటర్వ్యూలతో బిజీగా వున్నారు.

అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించాలని కేవలం మెగా హీరోలే కాకుండా చాలా మంది ఇతర నటులు కూడా ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. కానీ వరుణ్ తేజ మాత్రం పవన్ కళ్యాణ్ తో నటించడానికి భయపడుతున్నాడు. అందుకు వరుణ్ తేజ ఓ సింపుల్ కారణం చెప్పేసి తప్పించుకున్నారు.

ఈ విషయంపై వరుణ్ మాట్లాడుతూ... బాబాయ్(పవన్ కళ్యాణ్) అంటే భయం. ఆయనతో కలిసి నటించడం తనవల్ల కాదని వరుణ్ చెబుతున్నాడు. మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన ఇతర నటులలో ఎవరితోనైనా నటించడానికి సిద్ధమే కానీ బాబాయ్ తో తప్ప అని అంటున్నాడు. బాబాయ్ తో నటించే అవకాశం వచ్చినా కూడా అది తనవల్ల కాదని, నిజం చెప్పాలంటే ఆయనతో కలిసి కెమెరా ముందుకు కూడా వెళ్లలేనని చెబుతున్నాడు.

చరణ్ తో నటించడానికి కంఫర్ట్ గా ఫీలవుతానని, కానీ తాము ఇద్దరం కలిసి నటించడానికి తగిన కథ, సమయం కుదరాలనీ.. అలా రెండు కుదిరినపుడు తప్పకుండా చేస్తామని వరుణ్ స్పష్టం చేసాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Varun Tej  Scared  Pawan kalyan  Interviews  Kanche  

Other Articles