Pranitha signs for mahesh babu bramhotsavam movie as second heroine | rakul preet singh | srikanth addala

Mahesh babu bramhotsavam movie pranitha second heroine rakul preet singh

mahesh babu, bramhotsavam movie, pranitha, actress pranitha, rakul preet singh, srikanth addala, pvp banner movie, potluri v prasad, mickey j mayer, tollywood movies

mahesh babu bramhotsavam movie pranitha second heroine rakul preet singh : Bapubomma Pranitha has signed as second heroine for mahesh babu in bramhotsavam movie. Rakul preet singh will act as first heroine for mahesh in this movie.

మహేష్ ‘బ్రహ్మోత్సవం’లో బాపుబొమ్మ సంబరాలు

Posted: 06/01/2015 02:55 PM IST
Mahesh babu bramhotsavam movie pranitha second heroine rakul preet singh

కష్టకాలాల్లో మగ్గుతున్నప్పుడు అదృష్టం తలుపు తట్టడమంటే ఇదేనేమో! చిన్నాచితకా సినిమాలు తీస్తూ కాలం వెళ్లదీస్తున్న ప్రణీత.. పవన్ కల్యాణ్ సరసన ‘అత్తారింటికి దారేది’ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే! అందులో రెండో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడికి తర్వాత మరే మూవీలోనూ నటించే అవకాశం రాలేదు. దీంతో చేసేదేమీలేక ఇతర ఇండస్ట్రీల్లో పాగా వేసింది. అక్కడ అందివస్తున్న ఆఫర్లను చేజార్చుకోకుండా తన కెరీర్ ని ముందుకు కొనసాగిస్తోంది. తన కెరీర్ ని మలుపు తిప్పే ఆఫర్ రాకపోదా..? అంటూ కాలక్షేపం చేసింది. ఇన్నాళ్లూ ఈమె చేసిన నిరీక్షణకు ప్రతిఫలం దక్కింది. ఏకంగా ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటించే భారీ ఆఫర్ ఈ అమ్మడు సొంతం చేసుకుంది.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ‘బ్రహ్మోత్సవం’ చిత్రం రూపొందుకుంటున్న విషయం తెలిసిందే! సూపర్ స్టార్ కృష్ణ బర్త్ డే సందర్భంగా ముహూర్త కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జూలై 10వ తేదీ నుంచి మొదలవుతుంది. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీలో ఇద్దరూ కథానాయికలు వుంటారని యూనిట్ ఇదివరకే తెలియజేసింది. ఇప్పటికే మొదటి హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోగా.. తాజాగా బాపుబొమ్మ ప్రణీతను రెండో హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు సమాచారం! రెండో హీరోయిన్ పాత్రలో ప్రణీత బాగా సూటవుతుందన్న ఉద్దేశంతోనే ఆమెను తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. మహేష్ సరసన నటించే భారీ ఆఫర్ రావడంతో ప్రణీత ఎంతో ఎగ్జైట్ అవుతోందని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి.

ఇదిలావుండగా.. ఈ ‘బ్రహ్మోత్సవం’ చిత్రాన్ని పీవీపీ సంస్థ తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రంగా భారీ బడ్జెట్ వెచ్చించి నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనింగ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం షూటింగ్ ని త్వరగా ముగించేసుకుని.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకోవాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఇంకా ఈ సినిమాకి సంబంధించి అధికారిక ప్రకటనలు త్వరలోనే విడుదల కానున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahesh babu bramhotsavam  pranitha  rakul preet singh  

Other Articles