The review of bahubali trailer which feels a new wonder world | prabhas | anushka shetty | rana daggubati | tamanna bhatia | rajamouli

Bahubali trailer review prabhas anushka shetty rana daggubati tamanna bhatia rajamouli

bahubali trailer review, bahubali movie updates, bahubali movie gallery, bahubali movie teaser, bahubali trailer, prabhas, tamanna bhatia, anushka shetty, rana daggubati, rajamouli, rajamouli news

bahubali trailer review prabhas anushka shetty rana daggubati tamanna bhatia rajamouli : The Review Of Bahubali Trailer which feels a new wonder world. This movie is made with 150 crores.

‘బాహుబలి’ ట్రైలర్.. అద్భుతానికి మారుపేరు

Posted: 06/01/2015 03:35 PM IST
Bahubali trailer review prabhas anushka shetty rana daggubati tamanna bhatia rajamouli

టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘బాహుబలి’. 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జక్కన్న తనదైన రీతిలో ప్రమోట్ చేస్తున్నారు. ముందుగా విడతలవారీగా ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసిన ఆయన.. 30వ తేదీన 10 సెకెన్ల నిడివిగల టీజర్ ని విడుదల చేశారు. ఆ టీజర్ ప్రేక్షకజనాల్లో సినిమాపై ఎంతో ఆసక్తిని పెంచింది. హాలీవుడ్ తరహా విజువల్స్ తో వచ్చిన ఈ టీజర్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక రాజమౌళి ముందుగా చెప్పినట్లుగానే ఈ మూవీ ట్రైలర్ ని ఈరోజు (01-06-2015) నిర్దేశించిన థియేటర్లలో విడుదల చేశారు. ఆ ట్రైలర్ ను వీక్షించిన జనాలు.. అది ‘మహాఅద్భుతం’కు మారుపేరు అంటూ అభిప్రాయాన్ని వెల్లడించారు.

‘బాహుబలి’ ట్రైలర్ గురించి చర్చించుకుంటే.. ప్రకృతి ఒడిలోనుంచి జాలువారుతున్నట్లుగా అనిపించే జలపాతంతో ట్రైలర్ మొదలువుతుంది. ఆ ప్రదేశంలో యువరాణి అవంతికా పాత్రలో నటిస్తున్న తమన్నా.. నృత్యం చేస్తూ దేవతకన్యలా కనువిందు చేస్తుంటుంది. ఇక అప్పుడు ఆమె దగ్గరకు చేరుకోవడం కోసం శివుడి పాత్రలో నటిస్తున్న ప్రభాస్.. అటువైపుగా వున్న బండరాయి మీద నుంచి దూకేస్తాడు. ఈ మొత్తం సన్నివేశం చూడ్డానికి ఎంతో రొమాంటిక్ గా అనిపిస్తుంది. అయితే.. ఇంతలోనే భల్లాదేవ పాత్రలో నటిస్తున్న రాణా ట్రైలర్ లో ఎంట్రీ అవుతాడు. అతని మహిష్మతి రాజ్యంలో ఎందరో ప్రజలు బానిసత్వ బతుకు జీవిస్తుంటారు. కట్ చేస్తే.. పెద్దపెద్ద ఏనుగులు, రాత్రి అడవిలో యుద్ధ సన్నివేశాలు, కురుక్షేత్రం యుద్ధాన్ని తలపించే విధంగా వేలాదిమంది సైనికులు పోరాడే మహాయుద్ధం సన్నివేశాలు.. ఇలా ఎన్నో అద్భుతమైన విజువల్స్ తో ఆ ట్రైలర్ నిండి వుంది. అయితే.. ఈ సినిమా కథేంటో పూర్తిగా తెలియకుండా వుండేలా జక్కన్న జాగ్రత్త పడ్డాడు.

ఈ ట్రైలర్ ని వీక్షించిన కొందరు ఇతర సినిమాలతో పోల్చుతున్నారు. ఈ ట్రైలర్ ని చూస్తుంటే ‘300’ మూవీని తలపిస్తున్నట్లుగా అనిపిస్తోందని, దాన్ని భారతీయ రాజమౌళి పునరావృతం చేస్తున్నారని అంటున్నారు. అయితే.. మరికొందరు మాత్రం ఈ ట్రైలర్ మీద ప్రశంసల వర్షాన్నే కురిపిస్తారు. ఈ చిత్రం భారతీయ పరిశ్రమకు మరో స్థాయికి తీసుకెళ్తుందని.. ప్రతి భారతీయుడు గర్వించేవిధంగా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని చెబుతున్నారు. దటీజ్ రాజమౌళి. అన్నట్లు ఈ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకు విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bahubali trailer  Prabhas  Rajamouli Anushka Shetty  

Other Articles