jadoogadu movie release postponed due to other releases | nagashourya | sonarika

Jadoogadu movie release postponed nagashourya sonarika

jadoogadu movie, naga shourya, sonarika news, jadoogadu movie updates, jadoogadu movie release, naga shourya movies, sonarika hot photo shoot, telugu small movies

jadoogadu movie release postponed nagashourya sonarika : The unit of jadoogadu movie has postponed the release date of that movie due to other movie releases. In this movie sonarika romance with naga shourya

‘జాదూ’ చేయాల్సినోడు.. కనిపించకుడా మాయమయ్యిండు!

Posted: 06/01/2015 12:24 PM IST
Jadoogadu movie release postponed nagashourya sonarika

ఇప్పటివరకు నటించిన ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య’, ‘లక్ష్మి రావే మా ఇంటికి’ వంటి చిత్రాల ద్వారా లవర్ బాయ్‌ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నడు యువహీరో నాగశౌర్య. అయితే.. ఈసారి ఆ చిత్రాలన్నింటికి భిన్నంగా ‘జాదూగాడు’ పేరుతో ఓ మాస్ ఎంటర్‌టైనర్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతమున్న ట్రెండ్ కు తగ్గట్టు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడం కోసం ఈ హీరో ఈ విధంగా సరికొత్త ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకు మరింత గుర్తింపు వస్తుందనే ఆశతో దాని రిలీజ్ కోసం నాగశౌర్య ఎంతో ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నాడు. అయితే.. ఇంతలోనే ఏమయ్యిందో తెలీదు కానీ.. ఈ ‘జాదూగాడు’ వున్నట్లుండి మాయమయ్యాడు.

అసలు విషయం ఏమిటంటే.. ‘చింతకాయల రవి’ ఫేం యోగేశ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను జూన్ 5న పెద్ద ఎత్తున విడుదల చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే! అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడింది. జూన్ 5న ఒకేసారి మూడు నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధమైనందున.. వాటి ప్రభావం తమ మూవీ మీద పడే అవకాశం వుందని భావించి.. వాయిదా వేసినట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పట్నుంచో సోలో రిలీజ్ కోసం ఎదురుచూస్తున్న ‘జాదూగాడు’.. అనుకోకుండా వాయిదా పడాల్సి వచ్చింది. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని సినిమా యూనిట్ తెలిపింది. సత్య ఎంటర్‌టైన్‌మెట్స్ పతాకంపై వి.వి.ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.

పూర్తి వినోదాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమాలో నూతన కథానాయిక సోనారిక బదోరియా హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఆమె తన అందచందాలను భారీగా ఒలకబోసిందని.. ఆమె అందం ఈ చిత్రానికి హైప్ తెచ్చిపెడాయని యూనిట్ భావిస్తోంది. మరోవైపు.. లవర్ బాయ్ నుంచి మాస్ అవతారమెత్తిన నాగశౌర్యకు.. ఈ చిత్రం ఎటువంటి విజయాన్ని అందిస్తుందోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jadoogadu  naga shouryan  sonarika  

Other Articles