Hansika increses the number of adopting children | kind heart | five more children

Actress hansika motwani adopting 5 more children

hansika adopted 5 more kids, Haniska moves away from films for kids, hansika adopted kids, Hansika to take care of kids, Hansika, takes break for 30 kids, Haniska, moves, away, Haniska movies, Haniska movie collections, films for kids, Actress Hansika Motwani, hansika advertisements, Hansika to take care of kids, sandalwood movie news, kollywood movies news

Actress Hansika Motwani loves children. She adopted 20 children on her 20th birthday and she is taking care about almost thirty kids. And now she adopts five more children adding to 35

అనాధల పాలిట మధర్ ధెరిస్సా.. హన్సిక

Posted: 05/31/2015 04:30 PM IST
Actress hansika motwani adopting 5 more children

మీరు నన్ను లవ్ చేస్తున్నారా..? నేనంటే అంత ఇష్టమా..? మీరు నా మనస్సును లవ్ చేస్తున్నారా..? శరీరాన్ని లవ్ చేస్తున్నారా..? ఈ శరీరం మీద మీరెందంత మమకారం పెంచుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇదంతా మట్టండీ మట్టి. మనం చచ్చిపోతే.  ఈ దేహం మట్టిలో కలసిపోతుంది. మన శరీరంలోని రక్తం, మూత్రం లాంటివి వాటర్ లో కలసిపోతాయి. ఈ ఊపిరి గాలితో కలిసిపోతుందంటూ దేశముదురు చిత్రంలో సన్యాసిని వైశాలి పాత్రలో నటించి.. హీరో అల్లుఅర్జున్ కు హితబోధ చేసే ప్రయత్నం చేసిన నటి హన్సిక నిజ జీవితంలో మాత్రం అనేకమంది సినీతారలకు ఆదర్శంగా నిలుస్తోంది.

తన సంపాదనతో ఆస్తులు అంతస్తులను కోనుగోలు చేయడమే కాకుండా అనాధ పిల్లలను దత్తత తీసుకుని వారికి మంచి చదువు, వుండేందుకు ఇళ్లు, తినేందుకు మంచి పౌష్టికాహారం తదితరాలను సమకూర్చతూ.. అచ్చం అమ్మ మాదిరిగానే చూసుకుంటోంది. అయితే ఇప్పుడున్న 30 మందికి అదనంగా మరో ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకోనున్నట్లు తెలిపింది.. హన్సిక మాట్లాడుతూ ప్రస్తుతం తాను నటిస్తున్న వాలు త్వరలో విడుదల కానుందన్నారు. జయం రవితో నటించిన రోమియో జూలియట్, విజయ్‌తో నటించిన పులి విడుదల కానున్నాయన్నారు. తనను వెదుక్కుంటూ ఏడు కథలు వచ్చాయని, వీటిలో రెండింటిని సెలక్ట్ చేశానన్నారు. పెద్ద హీరో, పేరున్న దర్శకుని చిత్రాలని, ఆయా సంస్థలు వీటి గురించి ప్రకటన విడుదల చేస్తాయన్నారు.
 
ఈ క్రమంలో హిందీ చిత్రాల్లో నటించేందుకు అవకాశాలు వస్తున్నాయని, తమిళ, తెలుగు చిత్రాల్లో బిజీగా ఉన్నందున ప్రస్తుతం నిరాకరించినట్లు తెలిపారు. చక్కని కథాంశంలో పెద్ద చిత్రాలు కుదిరితే నటిస్తానన్నారు. నిరాదరణకు గురైన చిన్నారులను దత్తత తీసుకుని పెంచుకుంటున్నానని, ఇంతవరకు 25 మంది పిల్లలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. మరో ఐదుగురు పిల్లలను ఆగస్టులో దత్తత తీసుకోనున్నానని, వీరి కోసం ముంబై శివారు ప్రాంతంలో స్థలం కొనుగోలు చేశానన్నారు. అందులో వారికి అనాథశ్రమం నిర్మిస్తానని తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hansika Motwani  Adopting 5 Children  Romeo Juliet  

Other Articles