సినిమా ఆఫర్ వచ్చిందంటే చాలు ఎగిరి గంతేసి ఛాన్సును సద్వినియోగం చేసుకుంటారు ఎవరైనా. అయితే అందులోనూ గ్లామర్ పాత్రలో నటించాల్సిన అవకాశం వస్తే.. రొట్టె విరిగి నేతిలో పడ్డట్టే అనుకుంటారు. కాగా నిత్యం ఒకే తరహా పాత్రలువేయడంతో.. బోర్ కోట్టేసి ఇక ఆ పాత్రలలో నటించను అని చెప్పిన వారు ఎందురుంటారు. కానీ ఈ కోలీవుడ్ అందాల అమ్మడు మాత్రం ఇక గ్లామర్ పాత్రలో నటించనని తెగేసి చెబుతోంది. నిత్యం గ్లామర్ పాత్రలలో నటించి నటించి తనకు బోర్ కొట్టేసిందని చెబుతోంది.
దీంతో, ఇకపై క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితం అంటున్నారు నటి సోనా. ఇటీవల ఆమె విలేకరులతో మాట్లాడారు. తమిళంలో ఇదివరకే ఒప్పందమైన చిత్రాలు మినహా వేరే చిత్రాల్లో నటించడం లేదని, ప్రస్తుతం శివప్పు మనిదర్గళ్ చిత్రంలో నటిస్తున్నట్లు తెలిపారు. కొన్ని చిత్రాల్లో గ్లామరస్‌గా నటించాలని కోరారని, అన్ని చిత్రాల్లో ఆ విధంగా నటించడం బోర్ కొడుతోందన్నారు. ఇకపై అటువంటి పాత్రల జోలికి వెళ్లనని అన్నారు. మలయాళంలో అమర్ అక్బర్ ఆంతోని సహా కొన్ని చిత్రాల్లో నటిస్తున్నానని, అక్కడున్న దర్శకులు తనను గ్లామరస్‌గా చూపించడం లేదన్నారు. ఒక్కో చిత్రంలో తన క్యారెక్టర్‌కు ప్రాముఖ్యం కల్పిస్తున్నారని, నటనను చూపే విధంగా ఈ పాత్రలు ఉన్నట్లు పేర్కొన్నారు.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more