pawan kalyan celebrates aadya birthday party

Pawan kalyan visits her daughter aadya birthday party

pawan kalyan news, pawan kalyan aadya photo, pawan kalyan aadya birthday party, pawan kalyan updates, pawan kalyan photos, pawan kalyan daughter aadya, pawan kalyan children, pawan kalyan renu desai, pawan kalyan aadya birthday, renu desai twitter photo

pawan kalyan visits her daughter aadya birthday party : Renu desai post a photo of pawan kalyan and his daughter aadya where they celebrates their daughter in pune.

కూతురితో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న పవన్

Posted: 03/24/2015 11:12 AM IST
Pawan kalyan visits her daughter aadya birthday party

‘ఢిల్లీకి రాజైనా.. తల్లికి మాత్రం కొడుకే’ అన్న సామెత ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి బాగానే సూటవుతుంది. ఎందుకంటే.. రేణుదేశాయ్ తో విడాకులు తీసుకున్నప్పటికీ పవన్ వారి పిల్లలైన అకీరా, ఆధ్యాల విషయంలో మాత్రం ఓ మంచి త్రండిగా బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా పిల్లలకు సమయం కేటాయించి వారితో సంతోషాలను పంచుకుంటూనే ఉన్నారు. ఓవైపు సినిమాలు మరోవైపు రాజకీయాలతో తీరిక సమయం లేకుండా ఫుల్ బిజీగా వున్నా.. తండ్రిగా తన పిల్లలకు సంతోషాన్ని అందిస్తున్నాడు.

ఇక తాజాగా తన కూతురు ఆద్యా పుట్టినరోజు వేడుకలకు పవన్ హాజరయి.. తన పిల్లలతో సంతోషంగా కాలం గడిపాడు. నిజానికి పవన్ ఎన్నో పనులతో బిజీగా వున్నప్పటికీ.. వాటన్నిటిని పక్కనపెట్టి తన కూతురి బర్త్ డే పార్టీకి వెళ్లారు. తన పిల్లలతో కొద్దిసేపటివరకు ఎంజాయ్ చేశాడు. ఈ క్రమంలోనే ఆధ్యతో పవన్ వున్న ఓ ఫోటోను రేణు దేశాయ్ ట్విటర్ లో పోస్ట్ చేసింది. “అందరికీ ఆయనొక నటుడు, లీడర్, స్టార్, పొలిటీషియన్.. కానీ తన కూతురికి ఆయనో నాన్న మాత్రమే!” అంటూ ఆమె ట్వీట్ కూడా చేసింది. అయితే... ఆ ఫోటోలో కేవలం పవన్ కాళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి. అలాగే ఆధ్య ఫేస్ కూడా సగం మాత్రమే కవర్ అయింది. దీంతో అభిమానులు ఫుల్ ఫోటో పోస్ట్ చేయమంటూ ట్వీట్ చేశారు.

అందుకు రేణు సమాధానం చెబుతూ.. ‘ఇది తండ్రికి, తనయకు మధ్య చోటు చేసుకున్న అందమైన మధురక్షణం. ఈ విషయాన్ని దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి. ఆ బంధాన్ని ఆస్వాదించండి. పూర్తి ఫోటో పోస్ట్ కావాలని మాత్రం ఫిర్యాదు చేయకండి’ అంటూ ఆమె రిక్వెస్ట్ చేసింది. అలాగే.. ‘నా కూతురి బర్త్ డేకి విషెస్ చెప్పిన వారందరికీ నా తరఫున, నా కూతురు ఆధ్య తరఫున థ్యాంక్యూ’ అంటూ ఆమె చివరగా పోస్ట్ చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan news  renu desai  aadya birthday celebrations  

Other Articles