Sai Dharam Tej | Rey Movie Updates | Shraddha Das

Sai dharam tej rey movie cencor report

rey movie cencor, rey cencor report, rey movie updates, rey movie news, sai dharam tej, sai dharam tej updates, shraddha das news, sai dharam tej shraddha das, mega family

sai dharam tej Rey Movie cencor report : Mega young hero sai dharam tej's first movie rey cencor report. In this movie there some masala scenes which are deleted and it get A certificate.

40 కట్స్ తో అడల్ట్ ముద్ర వేయించుకున్న ‘రేయ్’

Posted: 03/24/2015 11:31 AM IST
Sai dharam tej rey movie cencor report

మెగాకుటుంబం నుంచి వచ్చిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన తొలిచిత్రం ‘రేయ్’.. చాలాకాలం తర్వాత విడుదలకు సిద్ధమవుతోంది. నిజానికి ఈ మూవీ రెండేళ్ల క్రితమే విడుదల కావాల్సి వున్నప్పటికీ.. దీనిని స్వయంగా నిర్మించి తెరకెక్కించిన వైవీఎస్ చౌదరి ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోవడం వల్ల అప్పట్లో రిలీజ్ చేయలేకపోయారు. దీంతో వాయిదాల మీద వాయిదా పడుతూ.. చివరికి రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఈనెల 27వ తేదీన విడుదలతోంది.

ఈ నేపథ్యంలోనే ‘రేయ్’ మూవీ సర్టిఫికేషన్ కోసం సెన్సార్ బోర్డుకు పంపగా.. అక్కడ పలు కట్స్ పడినట్లు తెలుస్తోంది. అది కూడా ఒకటికాదు రెండుకాదు.. ఏకంగా 40 కట్స్ వరకు సెన్సార్ ఇచ్చినట్లు సమాచారం! అంతేకాదు.. దీనికి A సర్టిఫికెట్ కూడా ఇచ్చారట! ఈ సినిమాలో కొన్ని భారీ యాక్షన్ సీన్స్ తోపాటు మసాలా సన్నివేశాలు ఎక్కువగా వున్న క్రమంలోనే A సర్టిఫికెట్ ఇచ్చారని అంటున్నారు. దీంతో చౌదరీ కాస్త అప్సెట్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. అయితే.. ఈ విధంగా తమ మూవీకి A రావడం వల్ల ఇందులో ఏముందోనని చూడటానికైనా ప్రేక్షకులు థియేటర్లకు తండోపతండాలుగా వస్తారని, కలెక్షన్స్ పెరిగే అవకాశముందని భావిస్తున్నారట!

ఇదిలావుండగా.. ఇందులో చిరంజీవి నటించిన ‘దొంగ’ సినిమాలోని ‘గోలిమార్’ పాటతోబాటు ‘పవనిజం’ పాట కూడా వున్నట్లు తెలిసిందే! ఇటీవలే పవనిజం పాటను ఆర్.నారాయణమూర్తి చేతులమీదుగా భారీయెత్తున రిలీజ్ చేయడం జరిగింది. ఈ రెండు పాటలు తమ మూవీకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని యూనిట్ బృందం తెలుపుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rey movie cencor report  shraddha das  sai dharam tej  

Other Articles