Poonam pandey pending case bangalore court bollywood news sachin tendulkar vishnu photos

poonam pandey news, poonam pandey controversy, poonam pandey case, bangalore court poonam, poonam sachin photo, poonam bikini photos, poonam pandey hot photo shoot, poonam pandey gallery, poonam pandey seductive photos, poonam pandey sensations, poonam pandey sexy photos, poonam pandey bangalore court

poonam pandey pending case bangalore court bollywood news sachin tendulkar vishnu photos : Finally bangalore court dismissed bollywood sensational model poonam pandey pending case.

పెండింగ్ కేసు నుంచి విముక్తి పొందిన పూనం!

Posted: 03/12/2015 02:05 PM IST
Poonam pandey pending case bangalore court bollywood news sachin tendulkar vishnu photos

బాలీవుడ్ సంచలన మోడల్-నటి పూనం పాండే తన అర్ధనగ్న ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే! తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కోసమే ఈ అమ్మడు ఈ పద్ధతిని ఫాలో అవుతోందిలెండి! అయితే.. రాత్రికిరాత్రే పాపులర్ అవుదామన్న ఆశతో గతంలో ఈమె కాస్త ఓవర్ గా ఓ ఫోటోషూట్ ఇచ్చింది. అది సంచలనంగా మారడంతో ఈమె కోర్టులో బుక్కయ్యింది. ఆ కేసు ఇప్పటివరకు కొనసాగుతూ వచ్చింది కానీ.. తాజాగా దాన్ని కొట్టివేస్తున్నట్లుగా కోర్టు తీర్పునిచ్చి, పూనంకు ఊరటను కలిగించింది.

వివరాల్లోకి వెళ్తే.. పూనంపాండే 2012లో క్రికెట్ దిగ్గజం సచిన్ ముఖచిత్రంతో కూడిన విష్ణువు ఫోటోను పట్టుకుని, అర్థనగ్నం ఫోటోలను పోజులిచ్చింది. అయితే ఆ ఫోటోలు హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా వున్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఉమేశ్ అనే వ్యక్తి పూనంపై బెంగుళూరు కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీంతో ఆమెపై మత విశ్వాసాలకు భంగం కలిగించారన్న అభియోగంతో కేసు నమోదైంది. దీనికి సంబంధించి 2012 నవంబర్ 7వ తేదీన పూనంకు కోర్టు సమన్లు కూడా జారీ చేసింది. అప్పటినుంచి ఈ కేసు ఆమెను నీడలా వెంటాడుతూ వచ్చింది.

ఈ కేసు తప్పించుకోవడం కోసం పూనం తీవ్ర ప్రయత్నాలు చేసింది కానీ.. అప్పట్లో ఫలించలేదు. అయితే.. తాజాగా ఆ కేసును కొట్టివేస్తున్నట్లుగా బెంగుళూరు కోర్టు స్పష్టం చేసింది. పూనం న్యాయవాది వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి.. సాంకేతిక కారణాలను పేర్కొంటూ కేసును కొట్టివేశారు. దీంతో ఇప్పుడు ఈమెకు ఈ కేసు నుంచి మరింత ఊరట లభించింది. అంతా బాగానే వుంది కానీ.. రానున్న కాలంలో ఈమె ఇటువంటి తప్పిదాలు మళ్లీ చేసే సూచనలున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : poonam pandey  bangalore court  sachin vishnu avatar photos  bollywood news  

Other Articles