Manchu vishnu rajendra prasad maa association president elections

manchu vishnu, rajendra prasad, maa association president elections, manchu vishnu facebook, manchu vishnu twitter, manchu vishnu movies, manchu vishnu gossips, rajendra prasad gossips, rajendra prasad elections

manchu vishnu rajendra prasad maa association president elections : Manchu vishnu clarifies that he is not competing for maa association president elections. He said that he will supporting rajendra prasad.

చాలు.. ఇక రూమర్లు చాలు.. నా సపోర్ట్ ఆయనకే!

Posted: 03/12/2015 01:12 PM IST
Manchu vishnu rajendra prasad maa association president elections

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటీనటుల సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటైన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) కొత్త కార్యవర్గం కోసం మార్చి 29వ తేదీన అధ్యక్ష ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే! గత రెండేళ్లుగా ఈ అధ్యక్ష పదవిలో కొనసాగతున్న మురళీ మోహన్.. ఇప్పుడు మళ్లీ చేపట్టే ఆలోచన ఆయనకు లేదని తెలిసిన క్రమంలో నటకిరీటి రాజేంద్రప్రాసాద్ తెరపైకి వచ్చి.. తాను పోటీ చేయనున్నట్లుగా స్వయంగా వెల్లడించారు.

అయితే.. ఈ నేపథ్యంలోనే ఈ పోటీల్లో మంచువిష్ణు కూడా పాల్గొంటున్నాడనే వార్తలు వెలువడ్డాయి. దీంతో వీరి మధ్య పోటీ తప్పదని అంతా అనుకున్నారు. అయితే.. తాను ఈ పోటీల్లో పాల్గొనడం లేదని విష్ణు తాజాగా స్పష్టం చేశాడు. మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల విషయంలో విష్ణు పేరు రాగా.. తాజాగా దీనిపై ఆ హీరో తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ పోటీ క్రమంలో తనపై వస్తున్న రూమర్లను ఇకనుంచి ఫుల్ స్టాప్ పెట్టేయండని చెప్పిన అతగాడు.. తన సపోర్ట్ రాజేంద్రప్రసాద్ కే వుంటుందని తెలిపాడు.

‘‘మా ప్రెసిడెంట్ పదవికి నా పేరు పరిశీలిస్తున్నట్లు తెలిసి చాలా గౌరవంగా ఫీల్ అవుతున్నాను. అయితే.. ప్రస్తుతం మనోజ్ వివాహం, సినిమాల బిజీ కారణంగా ఆ పదవికి నేను న్యాయం చేకూర్చలేను. అలాగే.. తనకు ఆసక్తి వుందని రాజేంద్రప్రసాద్ అంకుల్ ప్రకటించారు కాబట్టి.. ఆయన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన్ను సపోర్ట్ చేద్దాం. ఇక నుంచి ఈ విషయంలో నా గురించి రూమర్లు రాయడం ఆపేయండి’’ అంటూ విష్ణు స్పష్టం చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : manchu vishnu  rajendra prasad  maa association president elections  

Other Articles