Amitabh bachchan south industry superstars nagarjuna kalyan jewellers advertisement shoot

amitabh bachchan, kalyan jewellers ad, amitabh bachchan latest news, amitabh bachchan photos, south industry superstars, kalyan jewellers latest ad, nagarjuna news, actor prabhu, shivraj kumar, nagarjuna, amitabh nagarjuna

amitabh bachchan south industry superstars nagarjuna kalyan jewellers advertisement shoot : Amitabh bachchan expressed his feelings after complete the shoot of kalyan jewellers advertisement with south industry superstar's sons.

‘బంగారం’ కోసం సౌత్ స్టార్స్ తో జతకట్టిన బిగ్ బీ

Posted: 03/12/2015 04:15 PM IST
Amitabh bachchan south industry superstars nagarjuna kalyan jewellers advertisement shoot

కళ్యాణ్ జ్యువెలర్స్ వారు తమ సంస్థని మరింతగా విస్తృతం చేయడం కోసం ఈసారి ఓ పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటికే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్, టాలీవుడ్ ‘మన్మథుడు’ నాగార్జున ఈ సంస్థకు ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇదివరకే వీళ్లిద్దరూ కలిసి ఈ జ్యువెల్లర్స్ ప్రచారం కోసం ఎన్నో యాడ్ లలో నటించారు కూడా! ఇప్పుడు తాజాగా కళ్యాణ్ జ్యువెల్లర్స్ యాజమాన్యం  మరో భారీ కమర్షియల్ యాడ్ చేసింది.

amitabh-bachchan

ఈ యాడ్ లో అమితాబ్, నాగార్జునలతోపాటు సౌత్ ఇండియాలోని ప్రముఖ స్టార్స్ అయిన ప్రభు అతని కుమారుడు విక్రమ్ ప్రభు, శివరాజ్ కుమార్, మలయాళీ హీరోయిన్ మంజు వారియర్ కలిసి నటించారు. పాపులర్ యాడ్ ఫిల్మ్ మేకర్ విఎ శ్రీకుమార్ దీనిని డైరెక్ట్ చేశారు. ఈ యాడ్ ఫిల్మ్ ని మునుపటికంటే చాలా భిన్నంగా, పూర్తి ట్రేడిషనల్ గా షూట్ చేశారు. ఫ్యామిలీ ఆడియెన్స్ ను మరింతగా ఆకట్టుకునేందుకు ఈ విధంగా ఆ సంస్థ యాజమాన్యం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

amitabh-tweets

amitabh-tweets-01

ఇక ఈ యాడ్ ఫిల్మ్ లో నటించినందుకు తనకు ఎంతో ఆనందంగా వుందని అమితాబ్ ట్విట్టర్ లో హర్షం వ్యక్తం చేశారు. ‘సూపర్బ్ అండ్ గ్రేట్ మార్నింగ్ విత్ సౌత్ ఇండస్ట్రీ. నా కెరీర్ స్టార్టింగ్ లో నా సీనియర్స్ అయిన అందరి సూపర్ స్టార్స్ కొడుకులతో కలిసినందుకు హ్యాపీగా ఉంది’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ యాడ్ ని ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారని సమాచారం!

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amitabh bachchan  akkineni nagarjuna  prabhu  kalyan jewellers  

Other Articles