Varun tej puri jagannath latest movie first look revealed

varun tej latest movie, puri jagannath latest movie, varun tej puri jagannath movie, director puri jagannath twitter, varun tej twitter, director puri varun tej movie, varun tej production no 2, varun tej gossips, puri jagannath gossips

varun tej puri jagannath latest movie first look revealed : director puri jagannath released his latest movie first look of varun tej and wishes his birthday.

ఆగిపోయిన ప్రాజెక్ట్’ను మళ్లీ స్టార్ట్ చేసిన మెగా-పూరీ..

Posted: 01/19/2015 06:50 PM IST
Varun tej puri jagannath latest movie first look revealed

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘ముకుంద’ మూవీ ద్వారా నటుడిగా తనను తాను నిరూపించుకున్న మరో మెగావారసుడు వరుణ్ తేజ్.. నిజానికి తన తొలిచిత్రం పూరీ జగన్నాథ్’తో చేయాల్సి వుండేది. అప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి కానీ.. అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ అక్కడితోనే ఆగిపోయింది. అందుకే.. ఎంట్రీకి ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో వరుణ్, అడ్డాలతో ఫిక్స్ అయి ‘ముకుంద’గా తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాడు.

ఇదిలావుండగా.. పూరీతో తీయాలనుకున్న చిత్రం ఇంకా సెట్స్’పైకి వెళ్లకుండానే ఆగిపోవడంతో వారిమధ్య విభేదాలొచ్చాయని ఆమధ్య వార్తలు హల్’చల్ చేశాయి. ఇకనుంచి మెగా కుటుంబంతో పూరీ సినిమాలు తీయడన్న సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే ఆ పుకార్లన్నింటికీ చెక్ పెడుతూ వరుణ్ తాను పూరీతో సినిమా చేస్తానని ‘ముకుంద’ విడుదల సమయంలోనే చెప్పారు. కానీ.. అంతకుముందు మరే విషయాలు అతను బహిర్గతం చేయలేదు. పూరీ కూడా దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు.

varun-tej-new-movie-news

కానీ.. ఉన్నట్లుండి వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా పూరీ సినిమా చేస్తున్నట్లు ఫస్ట్’లుక్’తో సహా వివరాలను వెల్లడించారు. వీరిద్దరి కాంబినేషన్’లో వస్తున్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ నిర్మిస్తారు. సికె ఎంటర్టైన్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ సమర్పణలో శ్రీ శుభ శ్వేతా ఫిల్మ్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 2గా ఈ సినిమా రూపొందనుంది. ఇదే విషయాన్ని పూరీ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. వరుణ్’కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ ఫోటోను పెట్టి.. ‘నీతో పనిచేయడానికి ఎదురుచూస్తున్నా’ అని పోస్ట్ చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : varun tej puri jagannath movie  varun tej birthday  telugu movies  

Other Articles