Nagarjuna karthi multistarrer movie remake fresh cinema the intouchables

nagarjuna karthi multi starrer movie, nagarjuna karthi movie story revealed, nagarjuna new movie story revealed, nagarjuna french movie, vamsi paidipally new movie news, shruti hassan new movie, nagarjuna latest movie news, nagarjuna karthi movie news, nagarjuna karthi news

nagarjuna karthi multistarrer movie remake fresh cinema the intouchables : According to the tollywood sources.. nagarjuna and karthi multistarrer movie story is inspired from french movie the intouchables which is the biggest hollywood hit movie.

నాగ్-కార్తీ మూవీ స్టోరీ రివీల్.. ఫ్రెంచ్ కథను కాపీ కొట్టేశారు!

Posted: 01/19/2015 06:21 PM IST
Nagarjuna karthi multistarrer movie remake fresh cinema the intouchables

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున - కార్తీ హీరోలుగా మల్టీస్టారర్ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! పీవీపీ బ్యానర్’పై పొట్లూరి ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్’గా నటిస్తోంది. తెలుగు, తమిళ భాషల్లో రానున్న ఈ చిత్రానికి ముందు కథ విషయంలో కాస్త గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే చివరికి ఫ్రెంచ్ కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తీయబోతున్నట్లు తెలుస్తోంది.

2011లో వచ్చిన ఫ్రెంచ్ సూపర్ హిట్ సినిమా ‘ది ఇన్’టచబుల్స్’ ఆధారంగా ఈ మల్టీస్టారర్ చిత్రం రూపొందుతోంది. ఈ మూవీ స్టోరీ ఏంటంటే.. పోలీసుల బారినుంచి తప్పించుకోవడం కోసం తనకు పక్షవాతం వచ్చినట్లుగా ఒక వ్యక్తి నటిస్తే.. అతనికి ఆసుపత్రిలో సేవలు చేసే ఓ మేల్ నర్సుకి మధ్య స్నేహబంధంతో ఆ మూవీ సాగుతుంది. అదే స్టోరీ గనుక ఈ తెలుగు మూవీకీ స్ఫూర్తి అయితే.. ఇందులో నాగార్జున పేషెంట్’గాను, మేల్ నర్సుగా కార్తీ నటించే అవకాశాలు వున్నాయి.

ఈ కథను చూస్తుంటే ప్రస్తుతం వస్తున్న సినిమాల కథలకు కాస్త భిన్నంగానే వుంది. అయితే దానిని దర్శకుడు వంశీ పైడిపల్లి తెలుగు ప్రేక్షకులకు నచ్చేవిధంగా ఎలా తెరకెక్కిస్తాడో వేచి చూడాల్సిందే! మరి.. ఈ కథను తెలుగు ఆడియెన్స్ ఏమేర ప్రోత్సహిస్తారో మూవీ రిలీజ్ అయ్యేంతవరకు తెలియదు. అయితే.. ఈ విషయం యూనిట్ వర్గాల నుంచి ఇంకా అధికారికంగా వెలువడి కాలేదు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles