Censor board new chairman and members announced

jeevitha rajasekhar, Delhi Censor Board, Censor Board new members, Censor Board new chairman, Pahlaj Nihalani, Pahlaj Nihalani censor board new chief, Pahlaj Nihalani latest, censor board new members, Jeevitha appointed in censor board, jeevitha rajasekhar, jeevitha rajasekhar censor board member, tollywood latest

Censor Board new Chairman and members announced : Government of India re constitutes censor board with new members. Pahlaj Nihalani appointed as censor borad new chief and 9 members also appointed by government. jeevitha rajasekhar selected as censor board member

రాజశేఖర్ ఇంట్లో సంబరాలు

Posted: 01/20/2015 08:37 AM IST
Censor board new chairman and members announced

ఢిల్లీలోని కేంద్ర సెన్సార్ బోర్డు కొత్త చైర్మన్, సభ్యులను కేంద్రం ప్రకటించింది. కొత్త చైర్ పర్సన్ గా ప్రముఖ నిర్మాత పహ్లజ్ నహలాని నియమితులయ్యారు. నహలానితో పాటు 9మంది సభ్యులతో కూడిన కొత్త కమిటీని నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సభ్యుల్లో తెలుగు పరిశ్రమ నుంచి నటి, నిర్మాత జీవిత రాజశేఖర్ కు స్థానం దక్కింది. 9మంది సభ్యుల జాబితాను చూస్తే.., మిహిర్ భూటా,  అశోక్ పండిట్, చంద్ర ద్వివేది, వాణి త్రిపాఠి, సయ్యద్ బరి, జార్జ్ బేకర్, ఎన్.శేఖర్, రమేష్ పతంగె, జీవిత రాజశేఖర్ ఉన్నారు.

కొత్త చైర్మన్ గా నియమితులైన పహ్లాజ్ నిహలానీ బాలీవుడ్ లో చాలా ఫేమస్ సినిమాలు నిర్మించారు. ‘ఆంఖే’, ‘షోలా ఔర్ షబ్నమ్’, ‘తలాష్’ వంటి సినిమాలు నిర్మించి పాపులర్ అయ్యారు. ‘మెస్సెంజర్ ఆఫ్ గాడ్’ వివాదం నేపథ్యంలో చైర్మన్ పదవికి లీలా శాంసన్ సహా సభ్యులంతా రాజీనామాలు చేసిన నేపథ్యంలో కేంద్రం కొత్త సభ్యులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో తమను బుజ్జగిస్తుంది అని ఆశించిన మాజి సభ్యులకు భంగపాటే ఎదురయిందని చెప్పాలి.

తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంపికైన జీవిత విషయానికి వస్తే..., నటిగా కెరీర్ మొదలు పెట్టిన జీవిత రాజశేఖర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత నిర్మాతగా మారారు. రాజశేఖర్ హీరోగా వచ్చిన అనేక సినిమాలు నిర్మించారు. సొంతంగా బ్యానర్ కూడా ఉంది. చిన్న నిర్మాతల సంఘంలో జీవిత క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇండస్ట్రీలో కార్మికుల సమస్యలపై ముందుండి పోరాడే జీవితకు కేంద్ర సెన్సార్ బోర్డులో అవకాశం రావటం సంతోషకరమని ఆమె సన్నిహితులు చెప్తున్నారు. ఇక రాజశేఖర్ కుటుంబం అయితే సంబరాలు చేసుకుటోంది. తన భార్యకు అరుదైన గౌరవం దక్కిందని రాజశేఖర్ గొప్పగా చెప్పకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jeevitha rajasekhar  Delhi Censor Board  Pahlaj Nihalani  

Other Articles