Amitabh bachchan shamitab movie promotion modi republic day invitation

amitabh bachchan latest news, narendra modi news, narendra modi republic day invitation, shamitab movie promotions, shamitab movie news, barack obama news

amitabh bachchan shamitab movie promotion modi republic day invitation : bollywood big b amitabh bachchan rejected modi republic day invitation which is viral now.

మోడీ కాదు కదా.. ఒబామాను కలిసే తీరిక కూడా లేదట!

Posted: 01/15/2015 02:59 PM IST
Amitabh bachchan shamitab movie promotion modi republic day invitation

బాలీవుడ్ బిగ్-బీ అమితాబ్ బచ్చన్ ప్రస్తుతం ఎంత బిజీగా వున్నారంటే... మోడీ నుంచే కాదు కదా, ఒబామా నుంచి కూడా ఆహ్వానం అందితే వెళ్లేందుకు తీరిక కూడా లేకుండా గడుపుతున్నారట! ఓవైపు కేబీసీ షోతోబాటు మరిన్ని ప్రైవేట్ యాడ్స్, ఇతర కార్యక్రమాలతోనూ బిజీగా వున్న అమితాబ్.. మరోవైపు తన తాజా చిత్రం ‘షమితాబ్’ ప్రమోషన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఈ కార్యక్రమాల్లో భాగంగానే తీరిక లేకుండా గడుపుతున్నందన ఆయనకు ఇతర ప్రముఖుల్ని కలుసునేందుకు వీలు దొరకట్లేదని అంటున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ప్రధాని మోడీ తన పరిపాలనలో మొదటిసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అతిథిగా హాజరు కావాలని అమితాబ్’కు మోడీ కార్యాలయం నుంచి ఆహ్వానం పంపించారు. అయితే దానిని బిగ్-బీ ఎంతో సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. మొదట మోడీ ఆహ్వానాన్ని ఆయన అందించారని, తరువాత కొన్ని పనుల్లో బిజీగా వుండటంతో ఢిల్లీకి రాలేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. దీంతో, తనతో ఎంతో సన్నిహితంగా వుండే ప్రధాని మోడీ ఆహ్వానాన్నే అమితాబ్ తిరస్కరించడం సెన్సేషన్’గా నిలిచిపోయింది.

ఇందులో భాగంగానే తన నూతన చిత్రం ‘షమితాబ్’ ప్రమోషన్ కోసం అన్ని ఏర్పాటు సిద్ధం చేసుకున్న కార్యక్రమాల్లో బిగ్-బీ బీజగా వున్నందున ఒబామాను సైతం కలిసేందుకు తీరక లేదంటూ చెప్పుకుంటున్నారు. మరి దీనిపై మోడీ ఎలా స్పందిస్తారో, అందుకు బదులుగా అమితాబ్ ఎలా వ్యవహరిస్తారో? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amitab bachchan  narendra modi republic day  barack obama news  shamitab movie  

Other Articles