Sai dharam tej subramanyam for sale movie teaser release

sai dharam tej news, sai dharam tej movies, subramanyam for sale movie news, subramanyam for sale teaser, sai dharam tej new movie teaser, producer dilraju news, regina cassandra news, regina hot photo shoot, director harish shankar news

sai dharam tej subramanyam for sale movie teaser release : mega hero sai dharam tej latest movie subramanyam for sale teaser released.

టీజర్ టాక్: స్టెప్పులతో అదరగొట్టిన ‘సుబ్రమణ్యం’!

Posted: 01/15/2015 03:31 PM IST
Sai dharam tej subramanyam for sale movie teaser release

ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తన మొదటి మూవీ ‘పిల్ల నువ్వులేని జీవితం’తో మంచి సక్సెస్ అందుకున్న మెగాహీరో సాయిధరమ్ తేజ్.. ఆ మూవీ విజయం సాధించిందో లేదో అప్పుడే రెండో సినిమా షూటింగ్’లో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం ఈ మెగాహీరో ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ అనే మూవీ షూటింగ్’లో ఫుల్ బిజీగా వున్నాడు. ఇటీవలే ఆ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే లభించింది. తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఆ మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది.

ఈ టీజర్’లో సాయి మాస్ ఆడియెన్స్’కు తగ్గట్టు అదిరిపోయే మాస్ స్టెప్పులతో కనువిందు చేశాడు. ఈ చిత్రంలో హీరో సరసన రెజీనా హీరోయిన్’గా మరోసారి నటిస్తోంది. వీరిద్దరి కలిసి నటించిన ‘పిల్లా నువ్వులేని జీవితం’ భారీ హిట్ కావడంతో నిర్మాత దిల్’రాజు మళ్లీ వీరితోనే ఈ తాజా మూవీని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి మిక్కీ జే.మేయర్ స్వరాలు అందిస్తుండగా.. ‘గబ్బర్ సింగ్’లాంటి భారీ చిత్రాన్ని అందించిన హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలావుండగా.. దర్శకనిర్మాతలు ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్’ని జనవరి చివరివారం నుంచి యూఎస్ ప్లాన్ చేసినట్లు సమాచారం!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : subramanyam for sale movie  sai dharam tej news  regina cassandra news  

Other Articles