Gopala gopala movie hyderabad lawyers filed complaint saroor nagar police station

gopala gopala movie latest news, gopala gopala controversy, gopala gopala complaint, gopala gopala collections, pawan kalyan controversies, pawan kalyan latest news, venkatesh latest news, sriya saran hot photos, shriya saran gallery

gopala gopala movie hyderabad lawyers filed complaint saroor nagar police station : the hyderabad lawyers filed complaint against gopala gopala movie to remove some scenes in that movie where they showed badly about lawyers.

పోలీస్ స్టేషన్’లో బుక్కైన ‘గోపాల గోపాల’!

Posted: 01/15/2015 02:29 PM IST
Gopala gopala movie hyderabad lawyers filed complaint saroor nagar police station

సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన పవన్ కల్యాణ్, విక్టరీ వెంకటేష్ మల్టీస్టారర్ ‘గోపాల గోపాల’ చిత్రం.. మంచి రెస్పాన్స్’తో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లపరంగా దూసుకుపోతోంది. మొదట్లో ఈ చిత్రం హిందువుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా వుందంటూ కొంతమంది ఫిర్యాదు చేస్తే.. ఆ సమస్య నుంచి ఎలాగోలా బయటపడింది. ఇప్పుడు రిలీజై బాగా ప్రదర్శిస్తున్న ఈ చిత్ర వెంటనే ఈ చిత్రాన్ని నిలిపివేయాల్సిందిగా కోరుతూ సరూర్ నగర్ పీఎస్’లో ఫిర్యాదు నమోదైనట్లు సమాచారం!

‘గోపాల గోపాల’ చిత్రంలో న్యాయవాదులను దుర్భాషలాడే విధంగా కొన్ని సన్నివేశాలు వున్నాయని.. వాటిని సినిమాలో తొలగించాలని కోరుతూ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఆయా సన్నివేశాలను వెంటనే తీసేయాలని, లేకపోతే చిత్ర ప్రదర్శనను అన్ని థియేటర్లలో వెంటనే ఆపివేయాలంటూ కోరారు. అలా చేయని ఎడల తీవ్ర పరిణామాలను చవిచూడాల్సి వస్తుందని.. కోర్టుకెళ్లి ఆర్టర్ తీసుకువస్తామని న్యాయవాదులు అన్నట్లు తెలుస్తోంది. న్యాయపరమైన తమ వృత్తిని ఈ చిత్రంలో వ్యంగ్యంగా చూపించారని వారి వాదన!

ఈవిధంగా న్యాయవాదులు కంప్లైంట్ చేయడంతో సినిమాకి మరింత ప్లస్ పాయింట్ అవుతుందోమోనని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ.. మొదటిరోజు తప్ప మిగతా రోజుల్లో అంతగా కలెక్షన్లు రాలేదు. ఒక్కసారిగా బాక్సాఫీస్ రిపోర్ట్ పడిపోయింది. కానీ.. తాజాగా వచ్చిన ఈ ఫిర్యాదు మేరకు ఆ సన్నివేశాలేంటో తిలకించడానికి ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని, దాంతో కలెక్షన్లు పెరిగే అవకాశం వుందని అభిప్రాయపడుతున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gopala gopala controversies  pawan kalyan news  venkatesh movies  

Other Articles