Gopala gopala movie piracy

Gopala Gopala movie Piracy, Gopala Gopala movie, Gopala Gopala movie latest, Gopala Gopala movie updates, Gopala Gopala movie torrent download, Gopala Gopala movie wallpapers, Gopala Gopala photos, Gopala Gopala movie songs, Pawan Kalyan next movie, Upcoming telugu movies

Gopala Gopala movie piracy : Pawan Kalyan latest movie Gopala Gopala piracy cds playing in private travels buses. Gopala Gopala movie piracy played in Hyderabad to Vijayawada Dhanunjaya travels bus. Pawan Kalyan, Venkatesh fans angry over latest multistarrer movie piracy

గోపాల గోపాల పైరసీ

Posted: 01/13/2015 09:07 AM IST
Gopala gopala movie piracy

పవన్ కళ్యాణ్ సినిమాను మరోసారి పైరసీ భూతం వెంటాడుతోంది. గతంలో ‘అత్తారింటికి దారేది’ సినిమా విడుదలకు ముందే పైరసీగా మార్కెట్లలోకి రాగా.., తాజాగా విడుదల అయిన ‘గోపాల గోపాల’ సినిమా విడుదలైన సాయంత్రమే పైరసీగా దర్శనం ఇస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ బయల్దేరిన ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో జనవరి 10 రోజున సాయంత్రం ‘గోపాల గోపాల’ సినిమా ప్రదర్శించారట. బస్సులో కొందరు ప్రయాణికకులు ఫోటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయటంతో ఈ విషయం బయటకు వచ్చింది.

కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రైవేటు ట్రావెల్ యాజమాన్యాలు ఇలా కొత్త సినిమాలు ప్రదర్శిస్తున్నాయని విమర్శలు వస్తున్నాయి. తమ హీరో పైరసీ అయిందన్న విషయం తెలిసిన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ట్రావెల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఓ సీడీ షాపు నిర్వాహకుడు అంటే తన పొట్టకూటి కోసం ఇలాంటి పనులు చేస్తే క్షమించవచ్చు కానీ.., పెద్ద సంస్థలు కూడా పైరసీలను ప్రోత్సహించటంపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది.

గతంోల ‘అత్తారింటికి దారేది’ సమయంలో కూడా పైరసీ భూతం ఏకంగా ఇండస్ట్రీని కుదిపేసింది. సినిమా విడుదల కాకముందే పైరసీ వచ్చేసి సంచలనం కల్గించింది. సినిమా యూనిట్ కు చెందిన కొందరు వ్యక్తులే పైరసీ చేసినట్లు గుర్తించి నిందితులను అరెస్టు చేశారు. తాజాగా వచ్చిన సీడీలు పైరసీ మాఫియా పనా లేక థియేటర్ లో పనిచేసే సిబ్బంది ఈ నిర్వాకానికి పాల్పడ్డారా అనేది తేలాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopala Gopala movie  Piracy cds  tollywood  

Other Articles