Jagapathi babu on vb rajendra prasad death

VB Rajendra Prasad, VB Rajendra Prasad death, VB Rajendra Prasad died, VB Rajendra Prasad passes away, VB Rajendra Prasad, VB Rajendra Prasad movies, Jagapathi Babu movies, Jagapathi Babu family, Jagapathi Babu latest, Jagapathi Babu, Tollywood Updates

Jagapathi Babu on VB Rajendra Prasad Death : Actor Jagapathi Babu responded on his father death says VB Rajendra Prasad died peacefully. tollywood sad on VB Rajendra prasad death pays tributes to his service for industry

రాజేంద్రప్రసాద్ మరణంపై జగపతి బాబు స్పందన

Posted: 01/13/2015 08:33 AM IST
Jagapathi babu on vb rajendra prasad death

ఇండస్ట్రీని ఒంటరిని చేస్తూ తిరిగిరాని లోకాలకు వెళ్ళిన రాజేంద్ర ప్రసాద్ మరణంపై ఆయన తనయుడు, ప్రముఖ నటుడు జగపతి బాబు స్పందించారు. ‘బ్రతికినంత కాలం ప్రశాంతంగా గడిపిన తన తండ్రి చివరి సమయంలో కూడా ప్రశాంతంగా ఉన్నారని చెప్పారు. జీవిత కాలంలో ఎలాంటి దీర్ఘ అనారోగ్య సమస్యలతో బాధపడలేదు, ఇతరులను ఇబ్బంది పెట్టలేదు’ అని చెప్పారు. జీవితమంతా రాజులా బ్రతికిన రాజేంద్రప్రసాద్ చనిపోయే సమయంలో కూడా రాజులా ఉన్నారని చెప్పారు.

తన విజయంలో తండ్రి వెంట ఉండి నడిచారని గుర్తు చేసుకున్నారు. ఒక దశలో కెరీర్ దెబ్బతింటుందని చాలా ఆందోళన చెందారన్నారు. అయితే మళ్లీ కెరీర్ గాడిలో పడటంతో ఆయన కూడా కాస్త మనశ్శాంతిగా గడిపారన్నారు. కుటుంబపై రాజేంద్ర ప్రసాద్ కు చాలా ప్రేమ ఉండేదన్నారు. తన కూతురు వివాహం సమయంలో ఆశీర్వదించటంతో పాటు సోదరుడి కూతురు వివాహంకు కూడా ఆయన ఆశీర్వాదం అందించారని చెప్పారు.

నా తండ్రి ఎలాంటి ఇబ్బందుల మద్య చనిపోలేదు. ప్రశాంతంగా తుదిశ్వాస విడిచారు. రాజేంద్ర ప్రసాద్ తన తండ్రి అని చెప్పకునేందుకు చాలా గర్విస్తున్నట్లు జగపతిబాబు తెలిపారు. జగపతి ప్రొడక్షన్స్ బ్యానర్ ను స్థాపించి ఎన్నో సినిమాలు నిర్మించి, దర్శకత్వం వహించిన రాజేంద్ర ప్రసాద్ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ విచారం వ్యక్తం చేసింది. భావితరాలకు స్పూర్తినిచ్చే నిర్మాత దూరం కావటం బాధాకరమని సినీ ప్రముఖులు అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagapathi Babu  VB Rajendra Prasad  Tollywood  

Other Articles