Jagapathi babu s father vb rajendra prasad passes away

vb rajendra prasad passes away, hero jagapathy babu father passes away, director cum producer rajendra prasad no more, dasarabullodu movie director rajendraprasad no more, isha hospital, jagaathi babu father mo more, predominant director rajendraprasad mo more, rajendraprasas anthasthulu got national award, raghupathi venkaiah award, bollywood news, kollywood news, tollywood news, film fare awardee, jagapathi arts banner, latest tollywood news, tollywood news latest updates

Tollywood producer and actor Jagapathi Babu's father V. B. Rajendra Prasad passed away on Monday Night.

ప్రముఖ దర్శకనిర్మాత రాజేంద్రప్రసాద్ కన్నుమూత

Posted: 01/12/2015 10:03 PM IST
Jagapathi babu s father vb rajendra prasad passes away

ప్రముఖ దర్శక నిర్మాత వీబీ రాజేంద్రప్రసాద్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన ఇషా అస్పత్రిలో చికిత్స పోందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ప్రముఖ హీరో జగపతి బాబుకు పితృ వియోగాన్ని మిగిల్చారు. వీబీ రాజేంద్రప్రసాద్ మరణవార్తతో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగింది. గత కొంత కాలంగా ఒక్కక్కరుగా పలువురు ప్రముఖులను కోల్పోతున్న తరుణంలో రాజేంద్ర ప్రసాద్ మరణం తెలుగు చిత్ర పరిశ్రమను ధు:ఖసాగరంలో ముంచింది.

రాజేంద్రప్రసాద్ పూర్తి పేరు వీరమాచినేని బాబూ రాజేంద్రప్రసాద్. కృష్ణా జిల్లా గుడివాడలో 1932 నవంబర్ 4న ఆయన జన్మించారు. నటుడు అవ్వాలని వచ్చి నిర్మాతగా స్థిరపడ్డారు. తర్వాత దర్శకుడిగా మారారు. దసరా బుల్లోడు సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. 14 సినిమాలకు ఆయన దర్శకత్వం వహించారు. రెండు సినిమాలకు రచన చేశారు. దాదాపు 30 సినిమాలు నిర్మించారు.

దసరా బుల్లోడు, బంగారు బాబు, భార్యాభర్తల బంధం, ఆస్తిపరులు, అన్నపూర్ణ, ఆరాధన, ఆత్మబలం, అక్కాచెల్లెలు, రామకృష్ణులు, పిచ్చిమారాజు, కెప్టెన్ నాగార్జున తదితర సినిమాలు తీశారు. తెలుగు మేటి చిత్రనిర్మాతల్లో ఒకరిగా నిలిచారు. అక్కినేని నాగేశ్వరరావుతో ఎక్కువ సినిమాలు తీశారు. అంతస్థులు సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రం పురస్కారం అందుకున్నారు. సింహస్వప్నం ద్వారా తన తనయుడు జగపతిబాబును వెండితెరకు పరిచయం చేశారు. 2000లో కెవి రెడ్డి పురస్కారం అందుకున్నారు.

తమిళ, హిందీ భాషల్లోనూ రాజేంద్రప్రసాద్ స్వీయ దర్శకత్వంలో చిత్రాలను తెరకెక్కించారు. తన తనయుడు జగపతిబాబు హీరోగా ఆయన నిర్మించిన చిత్రాలేవీ విజయం సాదించకపోయినా, బాలకృష్ణ హీరోగా రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో ఆయన నిర్మించిన 'బంగారుబుల్లోడు' ఘనవిజయం సాధించింది. ఆయన కెరీర్ లో 'బంగారుబుల్లోడు' చివరి ఘనవిజయం. ఆ పైన చిత్రపరిశ్రమ పరిస్థితులకు ఇమడలేక ఆయన సినిమాలకు దూరంగా ఉన్నారు. హైదరాబాద్ లో ఫిలిమ్ నగర్ రూపొందడానికి, అక్కడి దేవాలయాల నిర్మాణంలోనూ ఆయన చురుకైన పాత్ర పోషించారు. ప్రభుత్వం ఆయనను రఘుపతి వెంకయ్య అవార్డుతో గౌరవించింది. చిత్రసీమలో వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మాత,దర్శకునిగా పలికించిన బాణీ భావితరాలకు స్ఫూర్తిగా నిలచింది.  

ప్రముఖుల సంతాపం :

వీబీ రాజేంద్రప్రసాద్‌ మృతిపట్ల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్‌, చంద్రబాబు  సంతాపం తెలిపారు. వీబీఆర్‌ మరణవార్త విన్న సినీ పరిశ్రమ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఆయన మరణం సినీలోకానికి తీరనిలోటు అని ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, నటీనటులు పేర్కొన్నారు. నటి జమున, డి. సరోజ, వాణిశ్రీ, విశాఖ శారథా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, మురళీమోహన్‌ తదితరులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయనతో కలిసి ఉన్నటువంటి క్షణాలను గుర్తుచేసుకుని కన్నీరుపెట్టారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vb rajendra prasad  passes away  jagapathi babu  tollywood  

Other Articles