Krishna vamsi adventurous movie

Krishna Vamsi, Krishna Vamsi movies, Krishna Vamsi upcoming movie, Krishna Vamsi latest news, Krishna Vamsi updates, Krishna Vamsi adventurous movie, tollywood latest, Upcoming telugu movies, Jenda pai kapiraju movie

Krishna Vamsi Adventurous movie : Tollywood director Krishna Vamsi have a dream to make adventurous movie. Krishna vamsi now making a movie with new artists in Dil Raju and Prakash Raj procuders of this movie

ఆ ముచ్చట కూడా తీర్చుకుంటాను

Posted: 01/12/2015 04:44 PM IST
Krishna vamsi adventurous movie

ఫ్యామిలి ఓరియంటెడ్, సంస్కృతి సాంప్రదాయాలను చూపించే సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉండే కృష్ణవంశీకి ఓ కల ఉందట. అది ఎప్పటికైనా నెరవేర్చుకోవాలని బాగా తపనపడుతున్నాడు. ఇంతకీ వంశీ కల ఏమిటంటే.. ఓ చక్కని అడ్వంచరస్ మూవీ చేయాలని ఉంది అని చెప్తున్నాడు. ఇప్పుడు నా కన్ను సాహసాలపై పడింది. నా స్టయిల్ లో ఓ అడ్వంచరస్ మూవీ తప్పకుండా చేస్తాను అని చెప్తున్నాడు. అయితే కథ ఇంకా ఓకే కాలేదు కాబట్టి ఎప్పుడు, ఎవరితో అనేది డిసైడ్ చేయలేదు.

ఇంతకీ ఇలా అనుకోవటానికి కారణం ఏమిటి. అంతగా ప్రభావితం చేసింది ఏమిటబ్బా అంటే హాలీవుడ్ క్లాసిక్ ఫిలిం ‘మెకన్నాస్ గోల్డ్’ అని చెప్తున్నాడు. ఈ సినిమా తనకు ఓ డిక్షనరి లాంటిదట. మూవీలో ఉన్న ప్రతి సీన్ తనను ఎంతగానో ప్రేరేపించాయని చెప్తున్నాడు. ఆ సినిమా వల్లే అడ్వంచరస్ మూవీ తీయాలని కోరిక పుట్టిందని చెప్తున్నాడు. ఇది సాధ్యమా అంటే ఫ్యామిలీ మెన్ అయిన కృష్ణవంశీ ‘సింధూరం’తో నక్సలిజంను చూపాడు. అదే వంశీ ‘అంత:పురం’ తీసి ఫ్యాక్షన్ రుచి చూపించాడు. అంతేకాదు ‘డేంజర్’ తో కొత్తతరం యువత మనో భావాలు కళ్లకు కట్టాడు. ఇవన్నీ సాధ్యం అయినప్పుడు నాతో అడ్వెంచర్ కూడా అవుతుంది అని ధీమాగా చెప్తున్నాడు.

అప్పుడంటే డైరెక్టర్ గారు మంచి ఫాం లో ఉన్నారు. సినిమాలపై బాగా నమ్మకం ఉండేది కానీ క్రమంగా కృష్ణవంశీ సినిమాలు అంటే.., మోజు తగ్గిపోయింది. అదే ఫ్యామిలి స్టోరీలతో సీన్లు నింపేస్తాడు అనే టాక్ తో నిర్మాతలు దూరం పెట్టారు. దీంతో తనలోని కొత్త యాంగిల్ చూపిద్దామని ‘పైసా’ వంటి ప్రయోగాలు చేసి మెగా ఫోన్ కాల్చుకున్నాడు. తనకు అచ్చొచ్చిన కుటుంబ కథనే ‘గోవిందుడు అందరి వాడేలే’ గా తీసి హిట్ కొట్టాడు. ప్రస్తుతం ప్రకాష్ రాజ్, దిల్ రాజు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఓ సినిమాకు డైరెక్టర్ గా పనిచేస్తున్నాడట. ఈ మూవీలో ఆర్టిస్టులంతా కొత్తవారేనట. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుందో ఇంకా తెలియదు. ఈ సినిమా పూర్తయితే ఆ తర్వాత అడ్వంచరస్ గురించి ఆలోచించవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishna Vamsi  telugu adventurous movies  tollywood latest  

Other Articles