Anisha ambrose not feel over gopala gopala movie role

Anisha Ambrose movie, Anisha Ambrose latest, Anisha Ambrose in Gopala Gopala, Anisha Ambrose in Gabbar Singh2, Gabbar Singh2 movie updates, Venkatesh in Gopala Gopala, tollywood updates, Anisha Ambrose, Anisha Ambrose photos, Pawan Kalyan next movie, Pawan Kalyan Gabbar Singh2 movie, Gabbar Singh2 cast and crew, Upcoming Telugu Movies

Anisha Ambrose not feel over Gopala Gopala movie role : Gabbar Singh2 heroine Anisha Ambrose not bothered about her role in Gopala Gopala movie. Anisha played a tv anchor role in Gopala Gopala who interviews Venkatesh. Gabbar Singh2 movie shooting will start soon in Bobby direction

అవమానం అనుకుంటే ఆ చాన్స్ వచ్చేదా..?

Posted: 01/12/2015 04:55 PM IST
Anisha ambrose not feel over gopala gopala movie role

హీరోయిన్ ను సైడ్ క్యారెక్టర్ చేయమని కోరితే.., ఎలా ఉంటుంది. కనీసం నిర్మాత ఫోన్ కూడా లిఫ్ట్ చేయదు. అలాంటిది పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసి పాపులర్ అయిన అమ్మాయి.., ఆయన సినిమాలోనే క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించటం అంటే మామూలు విషయం కాదు. అలా చేయటానికి ఎవరీకి మనసొప్పదు. కానీ అనీషా అంబ్రోస్ ‘గోపాల గోపాల’తో అది చేసి చూపించింది. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో వెంకటేష్ ను ఇంటర్య్వూ చేసే టీవీ యాంకర్ గా అనీషా నటించింది.

ఈ పాత్ర తనకు వచ్చినప్పుడు సన్నిహితులంతా వద్దని చెప్పారట. హీరోయిన్ గా చాన్స్ వచ్చాక ఇలాంటి క్యారెక్టర్ చేస్తున్నావంటే ఫ్యూచర్ లో ఇబ్బందులు వస్తాయని, పేరు పడిపోతుందని చాలామంది వారించారట. ఎవరెన్ని చెప్పినా వినకుండా సినిమాలో క్యారెక్టర్ చేసేసింది. ఎందుకిలా చేశావు అని ప్రశ్నిస్తే.., వెంకటేష్, పవన్ సినిమాలు మళ్ళీ వస్తాయని గ్యారంటీ లేదు. ఇద్దరు పెద్ద హీరోల సినిమా ఆఫర్ వస్తే, చేయకుండా ఎలా ఉండాలి అని ఎదురు ప్రశ్నిస్తోంది. అంతేకాకుండా ఒరిజినల్ వర్షన్ తనకు బాగా నచ్చటంతో పాత్ర చిన్నదా, పెద్దదా అని పట్టించుకోకుండా చేసేశాను అని చెప్తోంది.

‘గబ్బర్ సింగ్2’లో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు.., ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ‘పవర్’ సినిమా డైరెక్టర్ బాబీ ఈ మూవీని డైరెక్ట్ చేయనున్నాడు. సంక్రాంతి తర్వాత ప్రి ప్రొడక్షన్ పనులు వేగవంతం చేసి ఫిబ్రవరిలో ‘గబ్బర్ సింగ్2’ సినిమా షూటింగ్ మొదలు పెడతారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Anisha Ambrose  Pawan Kalyan  Gabbar Singh2  

Other Articles