I is not competitive for gopala gopala

I movie, I movie release date, I film release, I film tickets online booking, I movie telugu trailer, I movie teaser, I movie wallpapers, Vikaram in i movie, I manoharudu movie, I vs gopala gopala, tollywood updates, Upcoming telugu movies

I is not competitive for Gopala Gopala : South India's show man Shankar I movie all set to release on 14th January world wide. movie have a competition in tollywood with Gopala Gopala. film nagar talk that Pawan Kalyan Multi starrer will not affected by Vikram movie

‘ఐ’తో గోపాలుడికి గండం ఉందా..? లేదా..? ఏది నిజం

Posted: 01/12/2015 04:31 PM IST
I is not competitive for gopala gopala

సంక్రాంతి కానుకగా వస్తున్న సౌత్ ఇండియా షో మ్యాన్ శంకర్ మూవీ ఎందరికో పండగను తీసుకొస్తుండగా.., మరెందరికో భయాన్ని కల్గిస్తుంది. ఈ సినిమా వస్తుందంటేనే చాలామంది హీరోలు భయపడ్డారు. పెద్ద పెద్ద హీరోలు సైతం ఎందుకు వచ్చిన తలనొప్పి అనుకుని సైలెంట్ గా సైడ్ అయి... ‘ఐ’ తర్వాత చూసుకుందాం అనుకున్నారు. కానీ రేసులోకి వచ్చాక, గెలుపే లక్ష్యంగా పరిగెత్తాలనే స్పూర్తితో ‘గోపాల గోపాల’ సినిమా విడుదల అయింది. భారీ బడ్జెట్, అంతరకు మంచి భారీ అంచనాలు ఉన్నప్పటికీ ఎవరి అభిమానం వారిది, ఎవరి కలెక్షన్లు వారివి అనుకుని సినిమా వచ్చేసింది. ప్రస్తుతం మూవీ సూపర్ హిట్ గా దూసుకుపోతుంది. ఇప్పటివరకు బాగానే ఉంది. కానీ రెండ్రోజులు అయితే ‘ఐ’ సినిమా విడుదల అవుతుంది. ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతుంది అనే ఆందోళన వ్యక్తం అవుతుంది. సినిమా ఆడుతుందా.., లేక శంకర్ దెబ్బకు కలెక్షన్ మార్కు కుప్పకూలుతుందా అని ఫ్యాన్స్ లో అనుమానాలు ఉన్నాయి.

గతేడాది దీపావళికి వస్తుంది అనుకున్న శంకర్ సినిమా అనేక కారణాలతో మూడు నెలలు పోస్ట్ పోన్ అయింది. చివరకు శరవేగంగా పనులు పూర్తి చేసుకుని సంక్రాంతి విడుదలకు సిద్ధమయింది. కోర్టు కేసులు, ఫిలింఛాంబర్లో వివాదాలున్నా నన్నెవరూ ఏమి చేయలేరంటూ భారీ అంచనాలతో దూసుకొచ్చేందుకు రెడిగా ఉంది. ప్రమోషన్ టెక్నిక్ లో భాగంగా శంకర్ విడుదల చేసిన ట్రైలర్లు, టీజర్లు, ఫొటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. భాషతో సంబంధం లేకుండా అన్ని వీడియోలను ప్రేక్షకులు చూశారు. ఇలా విడుదలకు ముందే హల్ చల్ చేసిన సినిమా వస్తే, ‘గోపాల గోపాల’ కలెక్షన్లపై ఖచ్చితంగా ప్రభావం ఉంటుందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా సినిమా విడుదల అయిన తొలి ఐదు రోజులూ ఈ ఎఫెక్ట్ చాలా ఉంటుందని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.

ఇంకొందరు మాత్రం ఎవరి దారి వారిదే అని వివరిస్తున్నారు. పండగకు ‘ఐ’ ‘గోపాల గోపాల’ తప్ప మరే సినిమాలు విడుదల కావటం లేదు. పండగ తర్వాత మరో ఇరవై రోజుల వరకు కూడా ఏ మూవీల విడుదల లేదు. కాబట్టి అప్పటివరకు టాలీవుడ్ లో ఈ రెండిటి మద్యే పోటీ ఉంటుంది. ‘ఐ’ వచ్చిన తొలి వారం గోపాలుడి కలెక్షన్లపై కాస్త ప్రభావం పడ్డా.., ఆ తర్వాత మాత్రం అంతగా ప్రభావం చూపలేదని చెప్తున్నారు. రెండు సినిమాలు ఉన్నందున.. అభిమానులు ఖచ్చితంగా రెండిటికీ వస్తారని చెప్తున్నారు. కామన్ ఆడియన్స్ కు తోడు ఖచ్చితంగా ‘గోపాల గోపాల’నే చూస్తారు కాబట్టి కలెక్షన్లపై ప్రభావ ఉండదు అంటున్నారు. ఇలా ఎవరి వాదనలు వారు విన్పిస్తన్నా.., సినిమా విడుదల అయితేనే  అసలు విషయం తెలుస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : I movie  Gopala Gopala  Vikram movies  

Other Articles