Gopala gopala movie release postponed

Gopala Gopala release, Gopala Gopala postponed, Gopala Gopala movie release postponed, Gopala Gopala censor, Gopala Gopala censor problems, Gopala Gopala songs, Gopala Gopala latest updates, Gopala Gopala wallpapers, Gopala Gopala trailer, Pawan Kalyan latest updates, Venkatesh movies, sankranti movies, upcoming telugu movies

Gopala Gopala movie release postponed : sankranti release movie gopala gopala postponed to two days from 9th january. Pawan Kalyan latest movie censor works not completed on 7th, it may done on 8th january. due to censor works late gopala gopala movie release getting late

గోపాల గోపాల విడుదల వాయిదా

Posted: 01/08/2015 09:04 AM IST
Gopala gopala movie release postponed

పవన్ కళ్యాణ్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గోపాల గోపాల’ సినిమా విడుదలకు అడ్డంకులు ఎదురవుతున్నాయి. సంక్రాంతి రేసులో ఉన్న ఈ మూవీ ముందుగా అనుకున్న ప్రకారం జనవరి 9న విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ పనులు ఇంకా పూర్తి కాలేదు. దీంతో 9న విడుదల కావటం లేదని స్పష్టం అవుతోంది. సెన్సార్ పనులు పూర్తయితే కాని ఎప్పుడు విడుదల అయ్యేది చెప్పలేము. అయితే మూవీ యూనిట్ వర్గాలు మాత్రం 10 లేదా 11వ తేదీన విడుదల చేస్తామని చెప్తున్నాయి.  

ఇవాళ సెన్సార్ పూర్తి అవుతుందని మూవీ యూనిట్ భావిస్తోంది. బోర్డు సర్టిఫికెట్ వస్తే శుక్రవారమే విడుదల చేయవచ్చు. లేదంటే కాస్త ఆలస్యంగా అంటే సంక్రాంతి లోపు  ఎప్పుడైనా విడుదల చేసే అవకాశం  ఉంది. ఎందుకంటే థియేటర్లలో ఇప్పటివరకున్న సినిమాలకు సంబంధించి డిస్ట్రిబ్యూటర్లతో ఒప్పందాలు జరిగి ఉంటాయి కాబట్టి.., వాటిని పరిష్కరించుకుని ‘గోపాల గోపాల’ను ప్రదర్శించేందుకు రెండ్రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తానికి సినిమా సంక్రాంతికి విడుదల అవుతున్నా.., ఏ తేదీన అనేది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోతున్నారు.

ఈ మద్యే వచ్చిన మూవీ పాటలకు చాలాబాగున్నాయనే టాక్ వచ్చింది. అటు ట్రైలర్ కూడా బాగా ఆకట్టుకుంటోంది. ట్రైలర్ చూసినవారి సంఖ్య ఏడు లక్షలకు చేరువ అవుతోంది. తెలుగులో ఓ  ట్రైలర్ కు ఈ స్థాయిలో స్పందన రావటం ఇదే తొలిసారి. పోసాని యాక్టింగ్, పవన్-వెంకటేష్ కాంబినేషన్ సీన్లు చాలా బాగుంటాయని ట్రైలర్ చూస్తేనే అర్థమవుతోంది. హిందీ మూవీ ‘ఓ మై గాడ్’కు రీమేక్ గా తెరకెక్కిన ‘గోపాల గోపాల’ బాలీవుడ్ మూవీ కంటే బాగుంటుందని పవన్ ఫ్యాన్స్ చెప్తున్నారు.


If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopala Gopala  sankranti 2015 movies  pawan kalyan latest  

Other Articles