Nayanathara role in naanum rowdydhaan movie

Nayanathara movie, Nayanathara in Naanun Rowdydhaan movie, Nayanathara next movie, Nayanathara latest photos, Nayanathara hot photos, Nayanathara wallpapers, Naanun Rowdydhaan movie updates, Naanun Rowdydhaan shooting photos, Naanun Rowdydhaan cast and crew, Naanun Rowdydhaan wallpapers, kollywood updates, latest tamil movies

Nayanathara role in Naanum Rowdydhaan movie : glamorous heroine Nayanathara playing hearing - impaired person in Naanum Rowdydhaan tamil movie. Naanum Rowdydhaan shooting soon comes to end, major parts covered in pandicherry. by maintaining distance from glamorous roles rumors that nayana may ger marriage in one or two years

నయనకు మళ్ళీ పెళ్ళి టైం దగ్గరపడుతోంది

Posted: 01/08/2015 10:09 AM IST
Nayanathara role in naanum rowdydhaan movie

టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ ప్లేస్ లో ఉన్న నయనతార పలు కారణాలతో ప్లేస్ కోల్పోయింది. అయితేనేం అమ్మడికి కోలీవుడ్ కలిసి వచ్చింది. సీనియర్ హీరోయిన్ గా అక్కడ వరుసగా సినిమాలు చేస్తోంది. ప్రేక్షకులు కూడా బెంగళూరు భామను బాగా ఆదరిస్తున్నారు. ప్రభుతో ప్రేమ పెళ్లి వరకు వెళ్లి కొన్ని కారణాలతో ఇద్దరూ విడపోయిన విషయం తెలిసిందే. ప్రేమ మైకం నుంచి బయటపడి మళ్ళీ బుద్దిగా సినిమాలు చేసుకుంటూ.., అభిమానులే లోకంగా బ్రతుకుతున్న ఈ హీరోయిన్ కు త్వరలో పెళ్ళి జరుగుతుందని పుకార్లు వస్తున్నాయి.

కోలీవుడ్ ప్రముఖులంతా ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్ గా మాట్లాడుకుంటున్నారు. మూడు పదుల వయస్సున్నా చెదరని అందంతో.., అభిమానులను అలరిస్తన్న నయన కొద్ది కాలంగా ఎక్స్ పోజింగ్ తగ్గించేసింది. అంతేకాదు, గ్లామర్ రోల్స్ లో కూడా ఎక్కువగా నటించటం లేదు. దీంతో అమ్మడు మరో ఏడాదిలో లేకపోతే రెండేళ్ళలో పెళ్లి చేసుకుంటుందని నడిగర్ సంఘ ప్రముఖులు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే ఎవరితో ఏడు అడుగులు వేస్తుందనే విషయంపై మాత్రం ఎవరి నోటా ఫలానా వ్యక్తి అయి ఉండవచ్చు అని పేరు బయటకు రావటం లేదు. దీంతో నయనపై ఇండస్ర్టీలో మంచి అభిప్రాయమే ఉన్నట్లు అర్థమవుతోంది.

నిప్పు లేనిదే పొగ రాదు కదా.., అలాగే కోలీవుడ్ అంతా నయన పెళ్లికి టైమొచ్చిందని డిసైడ్ కావటానికి లేటెస్ట్ కారణం ఒకటుంది. ప్రస్తుతం ఈ తార ‘నానున్ రౌడీదాన్’ అనే సినిమాలో నటిస్తోంది. ఇందులో ఓ చెవిటి అమ్మాయిలా కన్పించనుంది. విజయ్ సేతుపతి హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ చాలావరకు పూర్తయింది. ఇండస్ర్టీలో గ్లామర్ పాత్రలతో ఉన్న చాలా సినిమాల ఆఫర్లు ఉన్నా.., గ్లామర్ టచ్ లేని ఈ ప్రాజెక్టునే ఎంచుకోవటంతో పెళ్ళి కోసమే ఎక్స్ పోజింగ్ తగ్గించింది అనుకుంటున్నారు. అంతేకాదు ‘అనామిక’, ‘మాయ’ సినిమాల్లోనూ ఇందులో భాగంగానే నటించిందని చెప్తున్నారు. కొద్దికాలం గ్యాప్ తర్వాత పెళ్ళి పుకార్లు మళ్ళీ మొదలు కావటంతో, వీటిపై నయన నోరు విప్పితేనే అసలు విషయం ఏమిటో బయట పడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naanun Rowdydhaan  Nayanathara  kollywood  

Other Articles

Today on Telugu Wishesh