Kalyan ram patas movie sankranthi festival gopala gopala i movies

nandamuri kalyan ram, kalyan ram latest news, kalyan ram patas movie, patas movie news, patas movie release date, patas movie songs, patas movie release, gopala gopala movie, sankranthi festival, chiyaan vikram news, i movie news, director shankar

kalyan ram patas movie sankranthi festival gopala gopala i movies : Finally kalyan ram has take decision to postpone his latest movie patas to january 23 as the big movies releasing on sankranthi festival.

సంక్రాంతికి ‘తుస్సుమన్న’ పటాస్!

Posted: 01/07/2015 01:22 PM IST
Kalyan ram patas movie sankranthi festival gopala gopala i movies

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు.. థియేటర్లలో కొత్త సినిమాల జోరు మొదలైపోతుంది. పెద్ద సినిమాల నుంచి చిన్న సినిమాలవరకు ఒకేసారి వరుసపెట్టి ఆరోజు రిలీజవుతాయి. ఈ పండుగ రోజుల్లో రిలీజ్ చేయడం వల్ల కలెక్షన్లు భారీ స్థాయిలో వస్తాయనే నమ్మకంతో ఒకదానికొకటి పోటీగా ఆనాడు సినిమాలు రిలీజవుతుంటాయి. ఈసారి రాబోయే సంక్రాంతికి చాలా సినిమాలే రిలీజవుతున్నాయి.

ముఖ్యంగా డైరెక్టర్ శంకర్ భారీ బడ్జెట్’తో తెరకెక్కించిన ‘ఐ’, పవన్ కల్యాణ్-వెంకటేష్ మల్టీస్టారర్ ‘గోపాలా గోపాలా’ చిత్రాలు రిలీజవుతున్నాయి. ఈ మూవీలతోబాటు మరికొన్ని సినిమాలు కూడా రిలీజ్ అవ్వాల్సి వుండేది. కానీ.. ఈ రెండు భారీ చిత్రాలు కావడంతో దాదాపు థియేటర్లు అన్నీ వీటికే కేటాయించాల్సి వచ్చింది. అటువంటి సమయాల్లో తమ సినిమాలను రిలీజ్ చేస్తే తక్కువ థియేటర్లే దొరకడంతోబాటు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్లు కూడా సరిగ్గా రావు. అందుకే.. చాలా సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. అంటే.. ఈసారి కూడా గతంలోలాగే పెద్ద సినిమాల ప్రభావం చిన్నసినిమాలపై భారీగానే పడిందన్నమాట!

ఇక విషయానికొస్తే.. ఆ రెండు పెద్ద సినిమాల ప్రభావం ఎక్కువగా వుండటంతో హీరో కళ్యాణ్’రామ్ స్వీయనిర్మాణంలో తెరకెక్కించిన తన ‘పటాస్’ చిత్రాన్ని వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. ఈ రెండు సినిమాలకే థియేటర్లు దాదాపుగా బుక్కయిపోవడంతో.. కల్యాణ్’రామ్ ఈ విధంగా నిర్ణయం తీసుకోక తప్పలేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పెద్ద సినిమాల బరిలో తన సినిమాను కూడా విడుదల చేయాలని కల్యాణ్ చాలానే ప్రయత్నాలు చేశాడు కానీ.. చివరికి అతని ఆశ నెరవేరలేదు. అందుకే.. ఈ చిత్రాన్ని ఈనెల 23వ తేదీన పోస్ట్’పోన్ చేసినట్లు సమాచారం! వరుసగా ఫ్లాపులను ఎదుర్కొంటున్న ఈ హీరో.. ఈ సినిమాతోనైనా తన కెరీర్ మలుపు తిరుగుతుందని ఎంతగానో ఆశిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles