Hero nikhil surya vs surya movie teaser tollywood new movies

tollywood hero nikhil, hero nikhil, surya vs surya movie news, surya vs surya movie teaser, hero nikhil surya vs surya, hero nikhil movie news, director karthik ghattamaneni

hero nikhil surya vs surya movie teaser tollywood new movies : hero nikhil latest movie surya vs surya teaser released.

హీరో నిఖిల్’పై పగబట్టిన సూర్యుడు..

Posted: 01/07/2015 12:32 PM IST
Hero nikhil surya vs surya movie teaser tollywood new movies

‘హ్యాపీడేస్’ చిత్రం ద్వారా తెలుగుతెరకు పరిచయమైన హీరో నిఖిల్.. ఆ తర్వాత అంతగా సక్సెస్ పొందలేకపోయాడు. కానీ.. స్వామిరారా, కార్తికేయ వంటి కమర్షియల్, థ్రిల్లర్ చిత్రాలతో వరుస హిట్స్ అందుకుని మాంచి ఊపుమీదున్నాడు. అంతేకాదు.. భారీ పారితోషికం ఇచ్చేందుకు కూడా ప్రొడ్యూసర్లు ముందుకు వస్తున్నారు. అయితే.. ఇంతలోనే ఈ హీరోకి ఏమైందోఏమోగానీ.. ఓ వింత జబ్బు బారినపడినట్లు వార్తలొస్తున్నాయి. సూర్యడు ఇతగాడి మీద పగబట్టాడనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇదంతా రియల్ లైఫ్’లో కాదులెండి.. రీల్ లైఫ్’లో!

ప్రస్తుతం హీరో నిఖిల్ ‘సూర్య వర్సెస్ సూర్య’ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే! ఎంతో ఇంట్రెస్టింగ్’గా వున్న ఈ టైటిల్ చూసి మొదట్లో అందరూ హీరో డ్యుయెల్ రోల్ వుండొచ్చని.. ఇద్దరి కవలల మధ్య నడిచే కథ అని అనుకున్నారు. కానీ.. అసలు కథ అది కాదు! కథ ఏంటంటే.. హీరో నిఖిల్’కి ఒక జబ్బు వుంటుంది. అతడు సూర్యకిరణాలను తాకలేడు. ఒకవేళ అతని ఒంటిపై సూర్యరశ్మి పడితే.. వెంటనే చనిపోతాడు. ఈ విధమైన జెనెటిక్ డిసీజ్’తో బాధపడుతున్న హీరో కేవలం రాత్రిళ్లు మాత్రమే బయటకు రాగలడు. అలాంటప్పుడు అతని జీవితం ఎలా సాగుతుంది..? అతడు ఆ వ్యాధి నుంచి బయటపడతాడా..? అతనికా జబ్బు ఎలా వచ్చింది..? అన్న కోణంలో సాగుతుంది.

వరుస హిట్లతో ముందుకు దూసుకుపోతున్న ఈ యువనటుడు మరో మైండ్’బ్లోయింగ్ కథాంశంతో వస్తున్న ఈ తాజా చిత్రం మీద కూడా ఎక్స్’పెక్టేషన్ భారీగానే వున్నాయి. నూతన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాను చాలా బాగా రూపొందించాడని అంటున్నారు. ప్రస్తుతం విడుదలైన టీజర్’ని చూస్తేనే అర్థమైపోతోంది.. కథ, కథాంశం, డైరెక్షన్ ఎలావుందో! విడుదలైన కొన్ని గంటలకే ఈ టీజర్’కు ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ చిత్రం కూడా భారీ హిట్ అవడం ఖాయమని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood hero nikhil news  surya vs surya movie news  telugu news  

Other Articles