Shraddha das sunami ghosts langkawi island

shraddha das news, shraddha das ghosts news, shraddha das langkawi island, shraddha das latest hot photos, shraddha das hot photo shoot, shraddha das gallery, shraddha das photo session, sayaji shinde ghost photo, sunami ghosts

shraddha das sunami ghosts Langkawi island : actress shraddha das saying that she saw ghosts in langkawi island

శ్రధ్దాకి చెమటలు పట్టిస్తున్న సునామీ దెయ్యాలు

Posted: 01/07/2015 11:25 AM IST
Shraddha das sunami ghosts langkawi island

ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానకాలంలో కూడా దెయ్యాలు వుంటాయంటే ఎవరైనా నమ్ముతారా..? అంతెందుకు.. అమెరికాలాంటి అగ్రదేశాల్లో కొన్ని పాతబడిన బంగ్లాల్లో దెయ్యాలు కనిపిస్తున్నాయంటూ ఒకదాని తర్వాత మరొకటి కథనాలు వస్తూనే వున్నాయి. అయితే దెయ్యాలు వున్నాయంటూ చాలావరకు ఎవ్వరూ నమ్మరుకానీ.. అప్పుడప్పుడు రాత్రివేళ్లలో కొన్ని అసాధారణమైన అరుపులు మాత్రం వినిపిస్తుంటాయి. ఇలా అన్నిచోట్లా కాదుకానీ.. కొన్ని భయంకరమైన స్థలాల్లో మాత్రం ఖచ్చితంగా వస్తుంటాయని అంటుంటారు. ఎవరో వచ్చి బెడ్’రూమ్ డోర్ కొట్టినట్లు, దూరంగా ఏవేవో భీకరశబ్దాలు వినిపించినట్లు.. పసిపిల్లల ఏడుపులు.. లాంటి అనుభవాలు కొందిరకీ ఎదురవుతుంటాయి. ఇప్పుడు ఈ లిస్ట్’లో తాజాగా హీరోయిన్ శ్రద్ధాదాస్ కూడా చేరిపోయినట్లు తెలుస్తోంది.

శ్రద్ధాదాస్ ప్రస్తుతం ‘ఊయిజ’ అనే చిత్రంలో కథానాయికగా నటిస్తోంది. ఇండియాలో కొద్దిపాటి షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ ఇప్పుడు మలేషియాలోని లంకావీ అనే దీవిలో చిత్రీకరణ చేసుకుంటోంది. ఈ షూటింగ్ నేపథ్యంలోనే చిత్రయూనిట్ అక్కడే ఓ హోటల్’లో బస చేసింది. అందులో శ్రద్ధాకి ఓ ప్రత్యేకమైన రూమ్ ఏర్పాటు చేశారు. అంతే! అప్పటినుంచి ఆమె జీవితంలో దెయ్యాలు ఎంటరైనట్లు చెబుతోంది. రోజూ ఆమె నిద్రిస్తున్న సమయంలో ఎవరో డోర్ కొట్టినట్లు శబ్దాలు రావడం, ఎక్కడినుంచో పిల్లల అరుపులు-ఏడుపులు వినిపించడం లాంటివి జరుగుతున్నాయట! ప్రతిరోజూ అర్థరాత్రి 1 నుంచి తెల్లవారుజామున 5వరకూ ఆమెకు ఇలాంటి శబ్దాలు వినిపిస్తూనే వున్నాయంటూ విలపిస్తోంది. తాను కొన్నాళ్లపాటు అక్కడే వుంటే తనకు పిచ్చిపట్టడం ఖాయమని వాపోతుందని సమాచారం!

ఇదిలావుండగా.. కొన్నాళ్లకిందట దాతాయ్ అనే దీవిలో సాయాజీ షిండే ఓ ఫోటో దిగారు. అయితే అందులో అతడి ముఖం మాత్రం కనిపించలేదు. కానీ.. పైపెచ్చు ఫోటోలో కుడివైపు ఓ పాదం కనిపించింది. ఇంతేకాదు.. ఆ దీవిలో ఇటువంటి వింతలు ఇంకా ఎన్నో చోటు చేసుకుంటున్నాయట! వందలకొద్ది పిల్లులు నిత్యం మనుషుల చుట్టూ వింతగా ప్రవర్తిస్తున్నాయట! దీంతో అక్కడి వెళ్లాలంటేనే అందరూ బెంబేలెత్తిపోతున్నారు. అసలు ఇలా ఎందుకు జరుగుతుందోనని ప్రస్తావిస్తే.. అప్పట్లో వచ్చిన సునామీ వేలాదిమంది ప్రాణాలను బలిగొన్న విషయం తెలిసిందే! చిన్నపిల్లలతోబాటు పెద్దలవరకు ఎంతో దారుణంగా మరణించారు. ఇప్పుడు ఆ ఆత్మలన్నీ అక్కడే తిరుగుతున్నాయని అంతా నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలో శ్రద్ధాకి ఎదురవుతున్న పరిణామాలను చూస్తుంటే.. ఆమె వెంట కూడా ఈ సునామీ దెయ్యాలే పడ్డాయని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shraddha das ghost news  langkawi island news  telugu news  

Other Articles