Yennai arindhaal movie release postponed

Yennai Arindhaal release postponed, Yennai Arindhaal latest updates, Yennai Arindhaal trailer, Yennai Arindhaal movie updates, Yennai Arindhaal latest photos, Yennai Arindhaal wallpapers, Ajith movie, Ajith Upcoming Movies, Ajith latest photos, Enthavadu gaani movie, kollywood updates, Upcoming tamil movies

Yennai Arindhaal movie release postponed : Ajith lead played Yennai Arindhaal movie release postponed due to I movie release. Ajith latest movie will come to audience after pongal or sankranti only. Yennai Arindhaal movie in post production movie cast and crew working hard to complete in time with good output.

మరీ అంత మంచితనం పనికిరాదు

Posted: 01/02/2015 04:44 PM IST
Yennai arindhaal movie release postponed

తమిళ్ హీరో అజిత్ మంచితనం గురించి చెప్పనవసరం లేదు. ఇండస్ర్టీలో స్టార్ హీరోగా ఉన్నా సాధారణ వ్యక్తిగా జీవితం గడుపుతూ అందరి మన్ననలూ పొందాడు. కేవలం ప్రజలకు సాయం చేయటంలోనే కాదు.., సినిమాల విషయంలో కూడా అజిత్ మంచితనం చూస్తే ముచ్చటేస్తుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ అయిన తమన్నాకు తమిళంలో సినిమాలు రాలేదు. ఇందుకు అక్కడి ఇండస్ర్టీకి చెందిన పెద్ద కుటుంబంతో గొడవే కారణం. ఈ కారణంగా మిగతా వారెవ్వరూ సినిమా ఛాన్స్ ఇవ్వకున్నా.., అజిత్ పిలిచి మరీ తమన్నాకు అవకాశం ఇచ్చాడు.

అయితే కొన్నిసార్లు మంచితనం పనికిరాదు. అతి మంచితనం కూడా ప్రమాదకరం అవుతుంది, చివరకు అది మనల్నే ముంచేస్తుంది. భారీ అంచనాల మద్య తెరకెక్కిన అజిత్ సినిమా ‘యెన్నై అరిందల్’ సంక్రాంతి విడుదల కోసం సిద్దం అవుతోంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ.., ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. పండగకు సినిమా వస్తుందని ఫ్యాన్స్ అంతా ఆశించారు. అయితే శంకర్ మూవీ ‘ఐ’ విడుదల నేపథ్యంలో ఈ సినిమాను వాయిదా వేసుకున్నారట. వాస్తవంగా చెప్పాలంటే ‘ఐ’ మూవీ ప్రభావం మిగతా సినిమాలపై ఉంటుంది. కానీ..., అజిత్ పై అంతగా ఉండకపోవచ్చు. ఎవరి క్రేజ్ వారిది అన్నట్లు ఇద్దరికి సమాంతర ప్రేక్షకులు థియేటర్లకు వస్తారు. కాని సినిమాల మద్య పోటి ఎందుకు అనుకుని మూవీని అజిత్ పోస్ట్ పోన్ చేయించాడట.

ఇలా అతి మంచితనంతో వాయిదాలేసుకుంటూ పోతే.., భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని టాక్ విన్పిస్తోంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘యెన్నై అరిందల్’ తెలుగులో ‘ఎంతవాడుగానీ’ పేరుతో డబ్ అవుతోంది. డిఫరెంట్ కాన్సెప్టుతో సినిమాలు తీసే అజిత్ కు ఈ మూవీ భారీ హిట్ ఇస్తుందని కోలీవుడ్ ప్రముఖులు అంటున్నారు. డబుల్ రోల్ పోషిస్తున్న ఈ మూవీలో అనుష్క, త్రిష హీరోయిన్లుగా నటిస్తున్నారు. నూతన సంవత్సర కానుగా విడుదల అయిన ఈ మూవీ ట్రైలర్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. రెండు రోజుల్లో పది లక్షల మందికి పైగా చూశారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajith movies  Yennai Arindhaal  Kollywood  

Other Articles