Amitabh bachan in meelo evaru koteswarudu

Amitabh Bachan, Amitabh Bachan in Meelo Evaru Koteswarudu, Amitabh Bachan latest updates, Amitabh Bachan movies, Amitabh Bachan kaun banega karodpati, tollywood updates, tollywood latest updates, meelo evaru koteswarudu latest shows, telugu tv shows, popular tv shows, Nagarjuna latest

Amitabh Bachan in Meelo Evaru Koteswarudu : Big B amitabh bachan participated in meelo evaru koteswarudu programme. Amitabh bachan MEV special programme will be telecasted in MAA TV soon

క్వశ్చన్ బ్యాంక్ నే క్వశ్చన్స్ అడిగారట

Posted: 01/02/2015 04:29 PM IST
Amitabh bachan in meelo evaru koteswarudu

హిందీలో అమితాబ్ బచ్చన్ ఎంత పాపులర్ అయ్యాడో.., తెలుగులో నాగార్జున కూడా ఆ స్థాయిలో క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇందుకు కారణం వీరిద్దరూ సినిమాలతో పాటు, టీవీ షోలలో కూడా

నటించటమే. బిగ్ బి కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమంలో షో హోస్ట్ గా చేస్తుంటే.., నాగార్జున ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అంటూ కొద్ది కాలం క్రితమే కార్యక్రమం మొదలు పెట్టారు. మా టీవీలో ప్రసారం అయ్యే ఈ కార్యక్రమం చాలా పాపులర్ అయింది. నాగార్జునకు మంచి పేరు తేవటంతో పాటు.., మాటీవీకి కూడా టీఆర్పీని పెంచేసింది.

సామాన్య ప్రజలతో పాటు.. అప్పుడప్పుడూ ఈ షోకు సెలబ్రిటీలు వస్తున్న విషయం తెలిసిందే. మొన్నే న్యూ ఇయర్ స్పెషల్ అంటూ సమంత కనువిందు చేసింది. సినిమాల్లో హీరోకు చుక్కలు చూపించే ఈ అమ్మడు, షోలో మాత్రం ఓ రేంజ్ లో టెన్షన్ పడింది (పైకి మాత్రం మామూలుగా కన్పించింది). ఇలా స్టార్లతో మరింత కలర్ ఫుల్ అయిన ‘మీలో ఎవరు కోటిశ్వరుడు’లో స్పెషల్ గెస్ట్ వచ్చాడు. ఆయనే బిగ్ బి అమితాబ్ బచ్చన్. ఆ మద్య హైదరాబాద్ వచ్చిన అమితాబ్ ను నాగార్జున కోరటంతో షో లో పాల్గొని వెళ్ళాడు.

ఏళ్లుగా ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ నిర్వహిస్తూ లక్షల మందికి ప్రశ్నలు సంధించిన బిగ్ బీ.., స్వయంగా హాట్ సీట్ లో కూర్చుని అవతలి వ్యక్తి నుంచి ప్రశ్నలు ఎదుర్కున్నాడు. ఇది వింటుంటేనే క్వశ్చన్ బ్యాంక్ ను క్వశ్చన్స్ అడగటం ఏమిటి అని ఆశ్చర్యం వేస్తుంది. ఇక బచ్చన్ జీ హాట్ సీట్ లో కూర్చుని ఎలా ఫీల్ అయ్యారు. ప్రశ్నలకు ఎలా సమాధానాలు ఇచ్చారు వంటి అంశాలు ఆసక్తిని కల్గిస్తున్నాయి. ప్రస్తుతం ఎడిటింగ్ దశలో ఉన్న ఈ షో ను త్వరలోనే స్పెషల్ ప్రోగ్రాంగా ప్రసారం చేస్తారట. చూడాలి మరి బచ్చన్ జీ కా కౌన్ బనేగా కోటిశ్వరుడు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amitabh Bachan  Meelo Evaru Koteswarudu  Nagarjuna  

Other Articles