Sruti hassan in nagarjuna karthi multi starrer movie

Sruti Hassan in Nagarjuna movie, Sruti Hassan in Karthi multi starrer movie, Sruti Hassan latest updates, Sruti Hassan movies, Sruti Hassan mahesh babu movie, Nagarjuna Karthi multi starrer movie updates, Nagarjuna upcoming movies, upcoming telugu movies, tollywood updates

sruti hassan in nagarjuna karthi multi starrer movie : tollywood top heroine sruti hasan acting in nagarjuna karthi multi starrer movie. sruti says in twitter that she is acting vamsi pydipalli movie. karthi telugu multi starrer movie will soon starts shooting, presently working on cast and crew selection

ఇద్దర్లో ఈ భామ ఎవరికో..?

Posted: 01/03/2015 08:35 AM IST
Sruti hassan in nagarjuna karthi multi starrer movie

టాలీవుడ్ లో  ఒకప్పుడు డీలా పడిన హీరోయిన్ ఇప్పుడు బిజీగా మారిపోయింది. ఐరన్ లెగ్ గా భావించిన  ఈ అమ్మడినే గోల్డెన్ లెగ్ గా కళ్లకు అద్దుకుని సినిమాల్లోకి తీసుకుంటున్నారు. వరుసగా  ప్రాజెక్టులపై సైన్లు చేస్తూ బిజీ షెడ్యూల్ క్రియేట్ చేసుకుంటోంది శృతి. ప్రస్తుతం తెలుగులో మహేష్ బాబుతో సినిమా చేస్తున్న ఈ అమ్మడు తమిళంలో విజయ్ తో నటిస్తోంది.  చెన్నై టు హైదరాబాద్ ట్రిప్పులు కొడుతూ షూటింగ్ లో పాల్గొంటోంది. ఇంత బిజీగా ఉన్న చెన్నై భామ త్వరలోనే మరో పెద్ద ప్రాజెక్టులో నటించనుంది.


నాగార్జున కార్తి కాంబినేషన్ లో త్వరలోనే ఓ మల్టీ స్టారర్ మూవీ ప్రారంభం అవుతుందన్న విషయం తెలిసిందే. వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేసే ఈ సినిమాను తెలుుగు, తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ ప్రాజెక్టులోకి శృతిని హీరోయిన్ గా తీసుకున్నారట. గతంలో తమన్నా అని... మరొకరు అని పేర్లు విన్పించినా, స్వయంగా శృతినే తన నెక్స్ట్ మూవీపై ట్విట్టర్ లో ప్రకటన చేయటంతో ఎంపిక ఖరారయినట్లే. వీరిద్దరు హీరోల కాంబినేషన్ లో పనిచేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని సంబరపడిపోతుందీ అమ్మడు.

పీవీపీ బ్యానర్ పై పొట్లూరి వరప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ మూవీలో ఇద్దరు హీరోలు ఉన్నా.., ఒకే హీరోయిన్ ఉండటంతో, ఇద్దర్లో ఎవరికి ఈమె సొంతం అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. నాగ్ ఫ్యాన్స్ అయితే అన్నయ్య పెళ్లి చేసుకోవటంతోనే కథ ముగుస్తుంది అంటుండగా.., కార్తి అభిమానులు మాత్రం, యంగ్ హీరోకు యంగ్ హీరోయిన్ అంటున్నారు. సో ఇద్దరిలో ఈ భామ ఎవరికి సొంతమో తేలాలంటే కొంతకాలం ఆగాలి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sruti Hassan  Nagarjuna karthi multi starrer  Tollywood Updates  

Other Articles