I manoharudu movie ar rahman re recording works getting late producer ravichandran kollywood news

i movie, i manoharudu movie, i movie news, i telugu movie, i tamil movie, director shankar, hero chiyan vikram, actress amy jackson, music director ar rahman, ar rahman latest news, ar rahman re-reording works, amy jackson hot photos, i movie latest news, amy jackson bikini photos, amy jackson latest photo shoots

i manoharudu movie ar rahman re-recording works getting late producer ravichandran kollywood news

రెహమాన్ వల్లే ‘ఐ’ విడుదల ఆలస్యం..?

Posted: 11/17/2014 02:46 PM IST
I manoharudu movie ar rahman re recording works getting late producer ravichandran kollywood news

తమిళ ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో విజయ్, అమీ జాక్సన్ జంటగా తెరకెక్కిన ‘ఐ’ చిత్రం ఇటీవలే ఆడియో వేడుకలు జరుపుకున్న విషయం తెలిసిందే! అంతవరకు ఎవరూ ఆసక్తి చూపని ఈ మూవీపై, ఆడియో ఫంక్షన్ అనంతరం విడుదలైన ట్రైలర్ తో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా..? అంటూ యావత్ భారతీయ అభిమానులందరూ తెగ వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ తర్వాత ఈ సినిమాకు మాంచి క్రేజ్ రావడంతో టాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు తెలుగు హక్కుల్ని భారీ రేటుకు కొనేసుకున్నారు కూడా! విడుదలకు ముందే మంచి కలెక్షన్లతోబాటు భారీ క్రేజును మూటగట్టుకున్న ఈ సినిమా.. విడుదల తర్వాత మరిన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందోనని సినీజనాలు ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతవరకు ఈ మూవీ విడుదల విషయంపై సినీబృందం నుంచి ఎటువంటి క్లారిటీ రావడం లేదు.

అయితే తాజాగా అందుతున్న సమాచారాల ప్రకారం.. ఏఆర్ రెహమాన్ వల్లే ఈ చిత్రం విడుదల ఆలస్యమవుతోందని తెలుస్తోంది. ఈ చిత్రానికి రీ-రికార్డింగ్ అదిరిపోయాలే పూర్తిగా ఆ పనిలో మునిగిపోయారని.. అందుకే ఈ మూవీ విడుదల విషయంలో మూవీ యూనిట్ బృందం ఇంతవరకు ఏ నిర్ణయం తీసుకోలేకపోతోందని కోలీవుడ్ నుంచి వార్తలొస్తున్నాయి. రీ-రికార్డింగ్ కోసం రెహమాన్ ఎక్కువ సమయం తీసుకుంటున్నారని, అందుకే మూవీ విడుదల జాప్యం మవుతోందని చెబుతున్నారు. మరోవైపు ఈ చిత్రం నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ ‘ఐ’ చిత్రాన్ని డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం! అయితే మూవీ విడుదల తేదీని మాత్రం ఇంతవరకు ఖరారు చేయలేదు. ఈ లెక్కప్రకారం చూస్తే.. ప్రేక్షకులకు ఈ మూవీ కోసం ఇంకొన్నాళ్లవరకు నిరీక్షణ చేయక తప్పదని విశ్లేషకులు అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : i movie  producer oscar ravichandran  director shankar  ar rahman  amy jackson  telugu news  

Other Articles