Superstar rajnikanth political speech linga movie audio release chennai

superstar rajnikanth, rajnikanth latest news, rajnikanth political speech, linga movie audio release, linga movie news, anushka shetty, sonakshi sinha, director shankar, hero aamir khan, jagapati babu, director ks ravikumar

superstar rajnikanth political speech linga movie audio release chennai : finally superstar rajnikanth speaks about his political experience in linga movie audio release function

రాజకీయాలంటే భయంలేదు కానీ.. ఒక్క విషయంలో వెనకాడుతున్నా..?

Posted: 11/17/2014 12:50 PM IST
Superstar rajnikanth political speech linga movie audio release chennai

బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటినుంచి సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తారనే వార్తలు ఎక్కువగానే పెరిగిపోయాయి. మొన్నజరిగిన సార్వత్రిక ఎన్నికలముందు నరేంద్రమోదీ ఆయన్ను కలవడం.. అలాగే ఎన్నికల ముగిసిన కొన్నాళ్ల తర్వాత బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా రజనీని కలవడం.. ఇంకా తమిళనాటలో వున్న బీజేపీ నాయకులు సైతం రజనీ రాజకీయ వ్యవహారాల గురించి మాట్లాడటం.. లాంటి విషయాలతో ఆయన ఇక రాజకీయాల్లోకి రావడం ఖాయమనే ఊహాగానాలు వచ్చేశాయి. అయితే ఆ విషయమై రజనీకాంత్ ఎప్పుడూ పెదవి విప్పలేదు కానీ.. తాజాగా ‘లింగా’ మూవీ ఆడియో ఆవిష్కరణ నేపథ్యంలో తన రాజకీయ అనుభవం గురించి అందరితో పంచుకున్నారు.

‘‘పరిస్థితులే నన్ను ఒక సాధారణ స్థాయి నుంచి నేడు ఇంతగా ఎదిగేలా చేశాయి. నాకు రాజకీయాలంటే భయంలేదు. వాటి గురించి అన్ని విషయాలు నాకు తెలుసు. అంతులో లోతెంతో కూడా అర్థం చేసుకోగలను. ఎంత ధైర్యం కావాలో తెలుసు. చాలామందిని అందులో దాటుకుని వెళ్లాల్సి వుంటుంది. ఇంతవరకు బాగానే వుందికానీ.. ఇవన్నీ సాధించిన తర్వాత ప్రజలకు మంచి చేయగలమా..? అనే ఆలోచనతోనే కాస్త వెనకడుగు వేస్తున్నా! ఏదేమైనా ఆ దేవుడు ఆదేశిస్తే నేను రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధంగానే వున్నాను. అది ఎప్పుడైనా, ఎలాగైనా జరగొచ్చు’’ అని సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టంగా పేర్కొన్నారు.

ఇదిలావుండగా.. రజనీకాంత్ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘‘లింగా’’ సినిమాలో అనుష్క, సోనాక్షి సిన్హాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేశ్ నిర్మించారు. గతంలో కొచ్చాడయాన్ సినిమాలో రజనీకాంత్ రియల్ గా కనిపించకపోవడంతోపాటు ఆ సినిమా ఘోరంగా పరాజయం పాలయిన నేపథ్యంలో ఈ సినిమాను కేవలం ఆరునెలల్లోనే ముగించేసి, డిసెంబర్ లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఈ మూవీ ఆడియో వేడుకకు జగపతిబాబు, దర్శకుడు శంకర్, ఆమీర్, కిచ్చా సుదీప్ తదితరులు పాల్గొన్నారు. ‘రోబో’ కంటే ఎక్కువ కలెక్షన్లను ‘లింగా’ మూవీ సాధిస్తుందని దర్శకనిర్మాతలు పూర్తి నమ్మకంతో వున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles