Mla supporters attack on brahmaji son sanjaykumar outer ringroad toalgate shamshabad airport

brahmaji news, brahmaji son sanjay kumar, brahmaji son sanjay kumar attack, mls prakash goud supporters attack sanjay kumar, outer ring road, shamshabad airport, mla prakash goud news

mla supporters attack on brahmaji son sanjaykumar outer ringroad toalgate shamshabad airport

బ్రహ్మాజీ కొడుకుపై దాడి ఎలా జరిగిందంటే...

Posted: 11/17/2014 03:08 PM IST
Mla supporters attack on brahmaji son sanjaykumar outer ringroad toalgate shamshabad airport

సినీనటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ పై ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అనుచరులు ఆదివారం సాయంత్రం ఔటర్ రింగురోడ్డులోని టోల్ గేట్ వద్ద దాడిచేసిన విషయం తెలిసిందే! ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు దాడిచేయడంతో సంజయ్ ముక్కుపై స్వల్పగాయమైంది. ఈ ఘటన జరిగిన వెంటనే ఇరువర్గాలు శంషాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. అయితే ఈ దాడి జరగడానికి గల అసలు కారణాలు ఏంటంటే..

ఆదివారం సాయంత్రం విశాఖపట్నం నుంచి వస్తున్న బ్రహ్మాజీని తీసుకెళ్ళేందుకు ఆయన కుమారుడు సంజయ్ తన కారులో ఎయిర్ పోర్టుకు ఔటర్ రింగురోడ్డుపై నుంచి వెళుతున్నాడు. అదేసమయంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గచ్చిబౌలినుంచి శంషాబాద్ కు వెళుతూ ఔటర్ రింగురోడ్డుపైపుగానే వచ్చారు. ఆ నేపథ్యంలోనే శంషాబాద్ సమీపంలోని కిషన గూడ టోల్ గేట్ వద్ద సంజయ్ టికెట్ తీసుకుంటున్నాడు. అప్పుడే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కారు సంజయ్ కారు వెనక వచ్చింది. ఆ సమయంలో ఎమ్మెల్యే వాహన డ్రైవర్ ముందున్న సంజయ్ కారుని తీయాలని కంటిన్యూగా హారన్ కొట్టాడు. దీంతో సంజయ్ తన కారునుంచి దిగి ఎమ్మెల్యే వాహనం వద్దకు వచ్చి డ్రైవర్ తో ఘర్షణకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.

ఎమ్మెల్యే, ఆయన గన్‌మెన్‌లు వారించే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న శంషాబాద్‌కు చెందిన ఎమ్మెల్యే వర్గీయులు కొందరు అక్కడికి చేరుకొన్నారు. వారిలో ఒకరు సంజయ్‌ ముఖంపై కొట్టడంతో అతని ముక్కు లోంచి రక్తం వచ్చింది. అయితే ఈ ఘర్షణ ఎక్కడ రాద్ధాంతం అవుతుందనే భయంతో అక్కడికి చేరుకున్న సీఐ సుధాకర, ఎమ్మెల్యేను వేరే వాహనంలో పంపించారు. అనంతరం ఇరువర్గాలు ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles