Supreme court dismiss pitition on amirkhan latest movie pk

supreme court, supreme court judges, supreme court judgements, amir khan, amir khan latest movies, amir khan pk movie, pk movie teaser, pk movie trailer, pk movie first look, pk movie, amir khan latest photos, anushka sharma, anushka sharma photoshoot, anushka hot photos, anushka sharma movies, anushka latest, bollywood latest, tollywood news

supreme court dismiss plea filed against amir khan latest movie pk : supreme court gives relaxation to amir khan dismiss plea on his movie pk

హమ్మయ్య! అమీర్ కు సుప్రీంలో ఊరట

Posted: 08/14/2014 11:43 AM IST
Supreme court dismiss pitition on amirkhan latest movie pk

అమీర్ ఖాన్ కొత్త సినిమా పీ.కే.పై నెలకొన్న వివాదంకు తెరపడింది. ఈ సినిమాకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ మద్యే పీ.కే సినిమా తొలి పోస్టర్ విడుదలయింది. అందులో అమీర్ ఖాన్ శరీరంలో కొద్ది భాగాన్ని మాత్రమే కవర్ చేస్తూ.., కన్పించాడు. ఈ ఫొటో వెరైటీగా ఉందని అభిమానులు చెప్తున్నా.., అభ్యంతరకరంగా ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమాకు వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు. వారి విజ్ఞప్తిని పరిశీలించిన కోర్టు.., కళలు, వినోదానికి సంబంధించిన అంశాలపై జోక్యం అవసరం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి పిటిషన్లు వేయవద్దని కొట్టి పారేసింది. దీంతో అమీర్ తో పాటు పీ.కే. సినిమా యూనిట్ ఊరట చెందింది. కోర్టు తీర్పు పై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అసభ్యకరంగా, ఎవరిని ఉద్దేశించి సినిమాను తీయటం లేదని చెప్పారు. నిబంధనలకు లోబడి సినిమాను తీస్తున్నామని స్పష్టం చేశారు.

పీకే సినిమాలో అమీర్ సరసన అనుష్క శర్మ నటిస్తోంది. అంతేకాకుండా సంజయ్ దత్, బొమన్ ఇరానీ, సుషాంత్ సింగ్ రాజ్ పుత్ సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నారు. రాజ్ కుమార్ హిరాని డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు హిరాని నిర్మాత. కామెడి సినిమాగా పీకే నిలుస్తుందని ప్రొడ్యూసర్ హిరాని చెప్పారు. దేవుడు, మనిషికి సంబంధించి సెటైర్ గా సినిమా ఉంటుందన్నారు. ఇప్పటికే తొలి పోస్టర్ కు మంచి స్పందన వచ్చిందన్నారు. అయితే రెండవ పోస్టర్ విడుదల వాయిదా పడింది. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం ఈనెల 15న పీకే రెండవ పోస్టర్ విడుదల కావాల్సి ఉంది. అయితే అదే రోజు షారుక్ ఖాన్ హ్యాపి న్యూ ఇయర్ పోస్టర్ విడుదల అవుతోంది. వివాదాలు కోరుకోని అమీర్.., షారుక్ తో ఇబ్బంది ఎందుకని పోస్టర్ విడుదలను వాయిదా వేసుకున్నారు. ఈనెల 20న రెండవ పోస్టర్ విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 19న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amir khan  pk movie  supreme court  anushka sharma  

Other Articles