(Image source from: tollywood hot heroine Sruthi hassan tattoos)
చిత్రపరిశ్రమలో వున్న హీరోయిన్ల వ్యవహారం ఒక్కొక్కరిది ఒక్కొక్కరకంగా వుంటుంది. వారు ఎప్పుడు ఎలా వుంటారో.. ఏం చేస్తుంటారో.. ఎలా కాలం గడుపుతుంటారోనన్న విషయాలకు సంబంధించి విచిత్రమైన వార్తలు అప్పుడప్పుడు వస్తూ వుంటాయి. ఇక లోకనాయకుడు కమల్ హాసన్ కుమార్తె శృతిహాసన్ కు సంబంధించి కొన్ని ప్రత్యేకంగా వార్తలు వస్తూ వుంటాయి. పెద్ద స్టార్ కుమార్తె అయినాగానీ సినిమాల్లో విచ్చలవిడిగా ఈ అమ్మడు తన అందాలను ఆరబోస్తూ కుర్రకారులను పిచ్చెక్కిస్తోంది. ఈ మాటలెలా వున్నా... ఈ అమ్మడి మీద రూమర్లు చాలానే వస్తుంటాయి. ఆమధ్య సిద్ధార్థతో సహజీవనం చేసిందని... ఇంకెవరితోనో రహస్యంగా కాలం గడుపుతోందని వార్తలు బాగానే షికార్లు చేశాయి. అయితే కొన్నాళ్ల తర్వాత వీటిపైన స్పందించిన శృతిహాసన్.. వాటిని ఖండించింది.
ఇప్పుడు తాజాగా ఈమెకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ అమ్మడికి ఎన్నిసార్లు అవి పొడిపించుకుంటున్నా.. మోజు మాత్రం తీరడం లేదంటూ స్వయంగా తానే చెప్పుకుంటోంది. తన శరీరం మీద ఎక్కడబడితే అక్కడ పొడిపించుకోవాలని ఆమెకు చాలా కోరిక వుందట! సినిమా షూటింగ్ అనంతరం తీరిక దొరికితే చాలు.. ఎప్పుడూ వాటి గురించే ఆలోచిస్తూ కాలం గడుపుతుందట! అయితే ఒక్కడ మరేదో ఊహించుకోకండి సుమా...! తనకు పచ్చబొట్లు పొడిపించుకోవడం చాలా ఇష్టమని తన తాజా ఇంటర్య్యూలో వెల్లడించింది.
సాధారణంగా టాటూలు వేయించుకోవడం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ గా మారిపోయింది. పెద్దపెద్ద స్టార్ల నుంచి గల్లీల్లో తిరిగే పిల్లలదాకా తన శరీరంమీద రకరకాల బొమ్మలు వేయించుకుని తిరుగుతూ వుంటారు. ఇక చిత్రపరిశ్రమలో వున్న తారలు కూడా రకరకాలుగా పచ్చబొట్లు వేయించుకోవడంలో ముందుంటారు. అందులో శృతిహాసన్ అయితే మరీను! ఇప్పటికే ఈ అమ్మడు తన ఒంటిపై నాలుగుసార్లు పచ్చబొట్లు పొడిపించుకుంది. ఎందుకిలా అని ప్రశ్నిస్తే.. తనకు చాలా ఇష్టమంటూ చాలాసార్లు చెప్పుకొచ్చింది. ఇప్పుడు తాజాగా మరొకటి వేయించుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచిపోయింది. మన సౌత్ ఇండస్ట్రీలో ఇన్నిసార్లు పచ్చబొట్లు పొడిపించుకున్న ఏకైక తారగా శృతిహాసన్ తన పేరును నమోదు చేసుకుంది.
ఇంతకుముందు శృతి తన మణికట్టుపై వున్న చిన్న టాటూ స్థానంలోనే ఇప్పుడు గులాబీ పువ్వును పచ్చబొట్టుగా పొడిపించుకుని.. వార్తల్లో నిలిచిపోయింది. కేవలం ఇక్కడే కాదులెండి.. ఈ అమ్మాయి పాదాల మీద, వీపు మీద.. ఇంకా రకరకాల ప్రదేశాల్లో టాటూలు వున్నాయి. ఇన్ని టాటాలూ తన శరీరం మొత్తం మీద వేయించుకున్న.. ఇప్పటికీ తనకు మోజు తీరలేదని వ్యాఖ్యానిస్తోంది హాట్ అండ్ సెక్సీ భామ! ఇంకా రానురాను ఎటువంటి ప్రదేశాల్లో పచ్చబొట్లు పొడిపించుకుంటోందోనని చిత్రపరిశ్రమలో వున్నవారందరూ చెప్పుకుంటున్నారు.
AS
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more