Ram charan and kajal agarwal duet song in london govindudu andari vadele movie

ram charan tej, govindudu andari vadele, kajal agarwal, director krishna vamsi, producer bandla ganesh, ram charan tej kajal agarwal, bandla ganesh krishna vamsi, tollywood hero srikanth, prakash raj latest news, kamilini mukherjee latest news

ram charan and kajal agarwal duet song in london govindudu andari vadele movie : tollywood mega power star ram charan tej duet song with kajal agarwal in govindudu andari vadele which is going to be shoot in london

లండన్ లో సీక్రెట్ గా ఆమెతో డ్యూయెట్ చేస్తున్న చరణ్!

Posted: 08/14/2014 12:08 PM IST
Ram charan and kajal agarwal duet song in london govindudu andari vadele movie

(Image source from: ram charan and kajal agarwal duet song in london govindudu andari vadele movie)

టాలీవుడ్ మెగా వవర్ స్టార్ రామ్ ఛరణ్ తేజ లండన్ లో ఒక అమ్మాయితో సీక్రెట్ గా డ్యూయెట్ చేస్తున్నాడనే వార్తలు ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తున్నాయి. ‘‘ఇంకెవరు.. తన భార్య ఉపాసనతో కలిసి హాలిడే ట్రిప్ కి వెళ్లి వుంటాడు’’ అని అనుకుంటే మాత్రం తప్పుగా ఊహించుకున్నట్టే! ఆమె మరెవరో కాదు... మగధీర సినిమాలో అతని సరసన మిత్రవిందగా నటించిన కాజల్ అగర్వాల్.

ప్రస్తుతం రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా ‘‘గోవిందుడు అందరివాడేలే’’ సినిమాలో కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే! ఈ సినిమా షూటింగ్ నేపథ్యంలోనే ప్రస్తుతం వీరిద్దరూ కలిసి లండన్ కి పయనిస్తున్నట్లు ఆ మూవీ యూనిట్ వర్గాలు సమాచారాన్ని అందిస్తున్నాయి. అక్కడే కాజల్ అగర్వాల్ తో కలిసి రామ్ డ్యూయెట్ పాడుతాడని వారు పేర్కొంటున్నాయి. ఈనెల 24వ తేదీ నుంచి లండన్ లో ఈ సినిమాకు సంబంధించిన రెండు పాటలను షూట్ చేయనున్నట్టు దర్శకనిర్మాతలు తెలిపారు.

Ram-Charan-kajal-hot

ఆ రెండో పాటల్లో ఒకటి చరణ్ పై సోలో కాగా.. మరొకటి చరణ్ - కాజల్ ఇద్దరిపై ఒక డ్యూయెట్ పాటను చిత్రీకరించనున్నట్లు ఆ మూవీ యూనిట్ స్పష్టం చేస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇక్కడ షెడ్యూల్ పూర్తయిన అనంతరం లండన్ వెళ్లనున్నట్లు సమాచారం! మ్యూజిక్ డైరెక్టర్ యువన్ శంకర్ రాజు సంగీతం అందించిన ఈ మూవీ పాటలను  వచ్చేనెల సెప్టెంబర్ రెండో వారంలో, చిత్రాన్ని అక్టోబర్ 1వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు నిర్మాత బండ్ల గణేష్ ఇప్పటికే స్పష్టం చేశాడు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles