Sarath kumar daughter varalakshmi playing prostitute role in tara tappatai movie

varalakshmi latest news, varalakshmi hot photos, sarath kumar daughter varalakshmi, varalakshmi prostitute role, varalakshmi hot photo shoot, varalakshmi movies

sarath kumar daughter varalakshmi playing prostitute role in tara tappatai movie : south industry star hero sarath kumar daughter varalakshmi playing a prostitute role for the first time which gores viral in kollywood and tollywood industries.

వేశ్యగా మారిపోయిన స్టార్ హీరో కూతురు!

Posted: 08/11/2014 03:47 PM IST
Sarath kumar daughter varalakshmi playing prostitute role in tara tappatai movie

ఆమె సౌత్ ఇండస్ట్రీలో వున్న ఒక స్టార్ హీరో కూతురు! ఎంతో అందమైన అమ్మాయి! సంస్కృతీ - సంప్రదాయాల మధ్య పెరిగిన అచ్చమైన తెలుగమ్మాయి! ఎవరితో ఎలా వ్యవహరించాలి..? గౌరవ మర్యాదలతో ఎలా మెలగాలి..? అన్న విషయాల్లో ఆరితేరింది. ఒక్క విషయంలో చెప్పాలంటే... ఆ అమ్మాయి ఆ హీరో ఇంటికి లక్ష్మీ వంటిది! అయితే ఇంతలోనే ఏమయిందో ఏమోగానీ... ఆమె వేశ్యగా మారిపోయింది. ఒక సంప్రదాయ అమ్మాయి అయినప్పటికీ.. వేశ్య అవతారాలు చేస్తూ పట్టుబడింది. ఆ అమ్మాయి మరెవరో కాదు.. స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు అయిన వరలక్ష్మీ!

సాధారణంగా స్టార్ హీరో కూతుళ్లు ఏదైనా మంచిపేరున్న విభాగాల్లోనూ లేదా వారసత్వ కారణంగా చిత్రపరిశ్రమల్లోనూ అడుగుపెడుతుంటారు. కానీ ఈ అమ్మడు వేశ్యగా అవతారమెత్తుతోందని తెలుసుకుని అందరి షాక్ కు గురయ్యారు. స్టార్ హీరో కూతురు అయి వుండి కూడా వేశ్యగా మారడమేంటని ఆరా తీస్తున్నారు. అయితే ఆ అమ్మడు కూడ వేశ్యగా మారింది నిజ జీవితంలో కాదులెండి... తన తదుపరి సినిమాలో ఆమె వేశ్య పాత్రలో నటించనుంది.

వరలక్ష్మీ ఇదివరకే నటించిన సినిమాలో పొట్టిపొట్టి గౌనులు వేసుకుని, అదిరిపోయే రేంజులో స్టెప్పులు వేస్తూ తమిళ తంబీలను ఆకట్టుకుంది. ఇప్పుడు తాను తాజాగా నటిస్తున్న ‘‘తార తప్పటై’’ సినిమాలో వేశ్యగా పాత్ర పోషిస్తోందన్న విషయం హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఈ సినిమాలో అమ్మడు మొదట నృత్యకళాకారిణిగానూ, తర్వాత వేశ్య క్యారెక్టర్ లో నటిస్తోందంటూ ఆ చిత్ర దర్శకుడు బాలా స్పష్టం చేస్తున్నాడు. వరలక్ష్మీ డ్యాన్స్ చాలా బాగా చేస్తుందనే కారణంతో తనను ఈ సినిమాలో పైగా రెండు విభిన్న పాత్రల్లో నటించడానికి అవకాశమిచ్చినట్లు ఆయన వెల్లడించాడు.

ఇదిలా వుండగా.. బాలా వంటి ప్రముఖ దర్శకుడి చేతిలో వరలక్ష్మీ వేశ్యగా నటిస్తోందంటే.. అదేమీ ఆషామాషీ పాత్ర అయి వుందని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. పైగా ఇందులో రెండు విభిన్న పాత్రల్లో పోషించడం వరలక్ష్మీకి కలిసి వచ్చిందని అందరూ అనుకుంటున్నారు. ఈ సినిమాతో ఈ హాట్ హీరోయిన్ కెరీర్ చిత్రపరిశ్రమలో స్థిరపడిపోతుందని.. ఖచ్చితంగా అవార్డు గెలుచుకోవడం ఖాయమని కోలీవుడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొదట ఈ రోల్ లో నటించడానికి ఇష్టపడని వరలక్ష్మీర.. తర్వాత సీనియర్ నటులను దృష్టిలో పెట్టుకుని ఒప్పుకున్నట్టు తెలుపుతోంది. ఏదిఏమైనా.. ఇంకా సినిమా విడుదల కాకముందే ఈ అమ్మడు వేశ్యగా మారిపోయిందని తన సినిమాను బాగానే ప్రచారం చేయించుకుంటోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles