Srikanth gif

hero srikanth, tollywood hero srikanth, srikanth sister nirmala, srikanth commit suicide, hero srikanth latest news, hero srikanth news, hero srikanth suicide news, hero srikanth sister nirmala, raksha bandhan festival, rakhi festival

Hero srikanth commit suicide sister nirmala clarification : tollywood hero srikanth committed suicide in his college days when his father scolded him. His sister nirmala shared some interesting movements of srikanth's teenage life.

హీరో శ్రీకాంత్ ఆత్మహత్యాయత్నం

Posted: 08/11/2014 04:30 PM IST
Srikanth gif

తెలుగు చిత్రపరిశ్రమలో ఫ్యామిలీ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజీని క్రియేట్ చేసుకున్న హీరో శ్రీకాంత్... తన 20ఏళ్ల కెరీర్ లో దాదాపు 100కు పైగా సినిమాల్లో నటించాడు. ఎవరి అండదండలు లేకుండా ఎన్నో అష్టకష్టాలు పడి చిత్రసీమలో అడుగుపెట్టిన అనంతరం.. పరిశ్రమలో వచ్చిన తర్వాత కూడా తనను తాను నిలదొక్కుకోవడం ఎన్నో అవాంతరాలను ఎదుర్కున్నాడు. తొలుత విలన్ గా పాత్రలు పోషించిన ఈయన.. తర్వాత హీరోగా అవతారమెత్తారు. ఒకవైపు ఫ్యామిలీ హీరోగా పేరు తెచ్చుకుంటూనే.. కమర్షియల్ సినిమాల్లోనూ నటిస్తూ మంచి విజయాలను అందుకున్నాడు. ఇతర సహాయసలహాలను పాటిస్తూనే సొంత కృషి, సంకల్పంతో ముందుకు సాగుతూ ఇవ్వాళ తనదైన ముద్ర వేసుకున్నాడు.

ఇదిలావుండగా.. తాజాగా ఈ హీరో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడంటూ కొన్ని వార్తలు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈయన ఈ ఘటనకు పాల్పడింది ఇప్పుడు కాదులెండి.. తాను చిత్రపరిశ్రమకు రావడానికి ముందు జరిగింది. ఆదివారంనాడు జరిగిన రాఖీ పండుగ నేపథ్యంలో శ్రీకాంత్ సోదరి నిర్మల.. ఆయనకు సంబంధించిన కొన్ని విషయాల గురించి బహిర్గతం చేసింది. ఆమె శ్రీకాంత్ తన సోదరుడిగా కాకుండా పెద్ద కొడుకుగా భావించేదని, తమ మధ్య వున్న ప్రేమానురాగాల గురించి ఆమె విశ్లేషించింది.

గతంలో శ్రీకాంత్, నిర్మల యుక్తవయస్సులో వున్నప్పుడు ఎన్నో చిలిపిచేష్టలు చేసేవారని తెలిపింది. ఈ నేపథ్యంలో ఒకనాడు తమ తండ్రి శ్రీకాంత్ ను తన చదువును నిర్లక్ష్యం చేస్తున్నాడని మందలించడంతో తాను ఆవేదనకు గురయి దగ్గరలోనే వున్న కాలువలో ఆత్మహత్యాయత్నం చేసుకోవడానికి వెళ్లాడట! ఆ సమయంలోనే తన సోదరి నిర్మల కూడా అతనిని వెంబడిస్తూ వెనకాల వెళ్లింది. అప్పడు ఆమె తనను ఎంతో నచ్చజెప్పి తిరిగి వెనక్కి తీసుకుని వచ్చినట్లు ఆమె గుర్తు చేసుకుంది.

ప్రతిఒక్కరి జీవితంలో సోదరి ఒక దేవదూతలా వ్యవహరిస్తుందని.. అందుకు శ్రీకాంత్ సోదరియే ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చని ఈ సంఘటన రుజువు చేస్తోందని చెప్పుకోవడంలో ఎటువంటి అనుమానం లేదు. ఈ విషయాన్ని స్వయంగా శ్రీకాంత్ కూడా ఒప్పుకున్నాడు. తన సోదరి తన జీవితంలో ఒక ఏంజెల్ అని చెపుకున్నాడు. వీరిద్దమరి మధ్య వున్న బంధం కలకాలం ఇలాగే కొనసాగాలని... వీరిలాగే అందరూ సోదరీ-సోదరులు కలకాలం మెలగాలని ఆశిస్తూ.. ‘‘తెలుగువిశేష్’’ అభినందనలు తెలుపుకుంటోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles