Manam director vikram k kumar next with suriya

manam director vikram k kumar next with suriya, hero suriya under vikram k kumar direction, vikram k kumar next with suriya, manam directors next with suriya

Manam Director Vikram k kumar Next With Suriya

విక్రమ్ కుమార్ కి లక్కీ ఛాన్స్ వచ్చింది

Posted: 07/04/2014 05:35 PM IST
Manam director vikram k kumar next with suriya

టాలీవుడ్ లోకి ‘ఇష్టం ’ సినిమా ద్వారా వెండితెర దర్శకుడిగా అవతారం ఎత్తిన విక్రమ్ కె. కుమార్ అంటే మొన్నటి వరకు పెద్దగా ఎవరికీ తెలియదు. ‘ఇష్టం ’ సినిమా తరువాత తెలుగులో అడ్రస్ లేకుండా పోయి తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేసిన విక్రమ్ అక్కడ ‘13 బి ’ అనే చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నాడు. దీంతో ఆయన బాలీవుడ్ లోనో, కోలీవుడ్ లో స్థిరపడతాడని అనుకున్నారు.

కానీ చాలా గ్యాప్ తరువాత తెలుగు నితిన్ తో ‘ఇష్క్ ’ సినిమా తీసి లైమ్ లైట్ లోకి వచ్చి, అక్కినేని ఫ్యామిలీతో ‘మనం ’ చిత్రాన్నితెరకెక్కించి టాలీవుడ్ లో ఓ దృశ్యకావ్యంగా ఆ సినిమాను తీర్చి దిద్దడంతో ఈయన పేరు ఇప్పుడు అంతటా మారుమోటమే కాకుండా, స్టార్ హీరోలు సైతం ఈయన దర్శకత్వంలో చేయడానికి ఉవ్విళ్ళు ఊరుతున్నారు. ఇప్పుడు ఈయనకు లక్కీ చాన్స్ తగిలింది. తమిళ స్టార్ హీరో సూర్యా చిత్రానికి దర్శకత్వం వహించే చాన్స్ దక్కించుకున్నాడు.

ఇటీవల ఈ దర్శకుడు సూర్యాని కలసి ఓ కథ వినిపించాడనీ, అతనికది బాగా నచ్చిందనీ సమాచారం. దీంతో వెంటనే విక్రం కుమార్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ప్రస్తుతం తాను చేస్తున్న వెంకట్ ప్రభు చిత్రం పూర్తి కాగానే విక్రం సినిమాని ప్రారంభిస్తాడట. ఒకవేళ అక్కినేని అఖిల్ ని పరిచయం చేసే బాధ్యత నాగార్జున అప్పగిస్తే... అఖిల్ చిత్రాన్ని ముందు తెరకెక్కిస్తాడో, సూర్య చిత్రాన్ని తెరకెక్కిస్తాడో చూడాలి.

Knr

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles